"నీలోనే సమస్త శక్తిదాగివున్నది..దానిని వెలికితీయి" అనే సూక్తిని గుర్తుచేస్తూ.. నీ భవితకు కర్త నీవను మాటలు నిజము చేయవోయి నిష్ఠతోడ పనులు సలిపి; కాక పరులడ్డుపడెనని నెపముబెట్టు విద్య నేర్వకోయి! అకారణ యుద్ధమువల్ల ఇక్కట్లపాలైన చిన్నారులను ఓదారుస్తూ.. నీ భవితకు కర్త నీవను మాటలు కల్లజేసె యిట్లు కపట జోడి; బలమువున్నదనుచు బాధ్యతలేకుండ బలగమున్నదనుచు బాధ్యతలేకుండ బాంబులేయుచుండె బాలిశులిట! యుద్ధోన్మదంతో పేట్రేగుతున్నోళ్ళ వలన ప్రపంచమంతా అట్టుడికిపోతున్న సందర్భం.. పొరుగువారితోడ పొగరుతో వర్తించు పాడుబుద్ధివుండె పాలకులకు (/పాతకులకు) పిచ్చివానిచేతి పిసరంతరాయైన పాట్లు దెచ్చుగాదె పరులకెపుడు! World needs Peace
పోస్ట్‌లు
మార్చి, 2026లోని పోస్ట్‌లను చూపుతోంది