"నీలోనే సమస్త శక్తిదాగివున్నది..దానిని వెలికితీయి" అనే సూక్తిని గుర్తుచేస్తూ..
నీ భవితకు కర్త నీవను మాటలునిజము చేయవోయి నిష్ఠతోడ
పనులు సలిపి; కాక పరులడ్డుపడెనని
నెపముబెట్టు విద్య నేర్వకోయి!
అకారణ యుద్ధమువల్ల ఇక్కట్లపాలైన చిన్నారులను ఓదారుస్తూ..
నీ భవితకు కర్త నీవను మాటలు
కల్లజేసె యిట్లు కపట జోడి;
బలమువున్నదనుచు బాధ్యతలేకుండ
బలగమున్నదనుచు బాధ్యతలేకుండ
బాంబులేయుచుండె బాలిశులిట!
యుద్ధోన్మదంతో పేట్రేగుతున్నోళ్ళ వలన ప్రపంచమంతా అట్టుడికిపోతున్న సందర్భం..
పొరుగువారితోడ పొగరుతో వర్తించు
పాడుబుద్ధివుండె పాలకులకు (/పాతకులకు)
పిచ్చివానిచేతి పిసరంతరాయైన
పాట్లు దెచ్చుగాదె పరులకెపుడు!
World needs Peace
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
దయచేసి మీ సలహాలను సూచనలను స్పష్టంగా పేర్కొనగలరు. plz see that ur comments are 'acceptable' in a value based society.