శ్రీరస్తు.. రామలింగ 18-1-24 (సూరసాని వారి ఆహ్వానము)


సూరసాని వారి ఆహ్వానము




శ్రీరస్తు!   శుభమస్తు!!


శ్లో.    శ్రీరామచంద్రః శ్రితపారిజాతః   సమస్త కల్యాణ గుణాభిరామః।

        సీతాముఖాంభోరుహ చంచరీకః   నిరంతరం మంగళమాతనోతుః॥


చిరంజీవి రామలింగారెడ్డి 

(శ్రీ సూరసాని చెంచిరెడ్డి  - శ్రీమతి నాగరత్తమ్మ గార్ల సుపుత్రుడు ఋజువర్తనుడు)


సుగుణవల్లి చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి  పుష్ప  

(శ్రీమతి & శ్రీ రమణమ్మ, దప్పిలి వెంకటేశ్వరరెడ్డి గార్ల  నోములపంట)


మనువు స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సర చైత్రమాస శుక్లపక్షం దశమి తేదీ 18-4-24 గురువారం  దేవతలు, వేదమూర్తులైన ద్విజోత్తములచే నిర్ణయింపబడిన ముహూర్తము 01:18కి (తెల్లారితే శుక్రవారం) జరుగును కావున తామెల్లరు విచ్చేసి వధూవరులను ఆశీర్వదించ ప్రార్ధన



వేదిక  పోలీసు కళ్యాణ మండపము, తాలూకా రక్షకభట నిలయము వద్ద, ఒంగోలు


విందు     రాత్రి 8 గంటలకు


గమనిక - ఇది లోక కళ్యాణకారకము కావలె కనుక..

1. ఆహూతులకు విజ్ఞానప్రదాయకముగా ఉండుటకు పుస్తక ప్రదర్శన, గణితంతో గమ్మత్తులు, శాస్త్ర ప్రయోగాలు ఏర్పాటు చేయబడును. సద్వినియోగం చేసుకొందురుగాక!

2. పదవినోదం, సుడొకు, రూబిక్ క్యూబ్, భాషా సంస్కృతులు_మనదేశ చరిత్రకి సంబంధించి చిన్న పోటీలు ఉంటాయి.   ఉత్సాహముగా పాల్గొనగలరు. ఎక్కడికెళ్ళినా  కలము కాగితము వెంట వుండటం మేలొనరించు.

౩. పటాటోపము లేని హుందాతనము, సంప్రదాయ వస్త్రధారణ అభిలషణీయము. బడికెళ్ళే పిల్లలు నీతిపద్యాలు, దేశభక్తిపాటలు ఆలపించే అవకాశం ఉంటుంది..ఓ అరగంట.

4. మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం కనుక అధిక శబ్దం  చేసేవి/ మిరిమిట్లు గొలిపేవి నిషేధం. నూనె/ కొవ్వు/ ఉప్పు/ మసాలా వంటివి పరిమిత స్థాయిలో వుండటం శ్రేయస్కరం.

5. స్వచ్ఛ భారత్ కోసం మీ అందరి సహకారం కావాలి

6.  కార్యక్రమంలో వీలైనంతవరకు ప్లాస్టిక్ వాడకం లేకుండా చూద్దాం.

7. ఉచితముగా వచ్చినంత మాత్రాన నీరు/ ఆహారము/ విద్యుత్ వృధా చేయరాదు

8. దేశ సంపదను టపాకాయల రూపంలో తగలెయ్యరాదు

9. తాయిలాలకు లొంగకుండా ఓటు హక్కును సరిగ్గా ఉపయోగించాలని మీకు విన్నపం

10. కట్నకానుకలు ఇవ్వనవసరం లేదు. అయినా అభిమానంతో, ఆశీఃపూర్వకముగా ఇవ్వదలచువారు ఖరీదైనవి కాకుండా ఒక్కో కుటుంబానికి వంద రూపాయలకు మించి ఖర్చు దాటని బాలసాహిత్యం పుస్తకం ఇస్తే బాగుంటుంది. ఆయా కానుకలను రంగుల కాగితంలో చుట్టి డబ్బు వృధా చేయక అందరికీ తెలిసేలా ఆ మంచి పుస్తకాన్ని అట్ట కనపడేలా ఇస్తే ఇతరులలో స్ఫూర్తి కలుగును.

11. నూతన దంపతులు మొక్క నాటెదరు. కార్యక్రమానికి వచ్చేవారు తమ తమ ఇళ్ళ వద్ద కూడా ఓ మొక్క నాటవచ్చు.

12. మధుర గీతాలు/ శాస్త్రీయ సంగీతం లౌడ్ స్పీకర్లో వినిపించబడును శబ్ద కాలుష్యం లేకుండా

13. ఈ వివాహం కేవలం ఇద్దరు వ్యక్తుల అభ్యున్నతికే ఐతే ఇతరులు రావటమెందుకు? పాల్గొనే ప్రతి ఒక్కరికీ లబ్ది చేకూర్చటమే మీకు ఈ ఆహ్వానం పంపటంలో ఉద్దేశం. ఉదా. ఉన్నత విద్య/ ఉపాధి అవకాశాలు తెలియచేయబడును

14. వాహనాల్లో వచ్చే వారు హెల్మెట్ పెట్టుకోవాలి/ సీట్ బెల్ట్ ధరించాలని మనవి

 


మీ అభ్యుదయంతో భారతదేశ భాగ్యోదయం ముడివడి ఉన్నది.. కనుక ఓ పెద్దలారా.. ఇలా సలహాలు వ్రాసితినని నాపై కోపగించవలదు. ఇవి పాటిస్తే ఆదర్శవంతంగా ఉంటుందని నా బుద్ధికి తోచినవి చెప్పితి. ఆచరణ మీ చేత(/తు)ల్లోనే ఉంది 


మరిన్ని వివరాలు/ తాజా సమాచారం padhaayee.blogspot.com


కార్యక్రమ నిర్వహణలో తమరు కూడా ఇలా పాల్గొనవచ్చు


ముందస్తు పోటీలు




  • శ్రీరస్తు వద్ద ఉన్న బొమ్మ ‘స్వస్తిక్’ అనుకున్నారా? అయ్యో! అది ‘టెట్రా ఇథైల్ మీథేన్!’ అనే రసాయనం!


 

  



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Spic macay

Assignment to gain eligibility to industry visit