అధర్మం విలయతాండవం చేస్తోంది

బతికి వుండగానే న్యాయము గెలిచేది చూడగలమా అనిపిస్తుంది జరిగిన జరుగుతున్న ఘటనలు చూస్తుంటే..

న్యాయస్థానాల్లో  రక్షకభట వ్యవస్థలోని వారిలో చాలావరకు తమకు అనుకూలమైన విధంగా పనిచేసుకుంటూ జన సామాన్యానికి ఇబ్బందులు కల్పిస్తున్నారని ఇంతవరకు ఉన్న అనుభవాలు చాటుతున్నాయి. 

1) 
తెలుగు ప్రాంత సమైక్యతను కోరిన సామాన్య ప్రజలను పోలీసులు పారా మిలటరీ దళాలవారు అడ్డుకున్నప్పుడు అలా అడ్డుకున్న (=యూనిఫాం వేసుకున్న) వాళ్ళ దేశభక్తి తేలిపోయింది. 

తెలుగునేల ఒకటిగా ఉండేలా తీర్పు ఇవ్వండి అని వ్యాజ్యం దాఖలు చేయచూస్తే కనీసం వ్యాజ్యం స్వీకరించటానికి కూడా పేరు గొప్ప సర్వోన్నతన్యాయస్థానానికి చేత కాలేదు.. వీరా దేశ సమైక్యతను కాపాడేది? తమకు కావాల్సిన అంశాల్లోనేమో.. సర్వాధికారాలు తమకు ఉన్నట్టు తాము గీచిన గీతను దాటరాదని చెప్పే కోర్టులు ప్రజలకు ఇబ్బంది కలుగుతున్న పలు అంశాల్లో తమకేం పట్టనట్టు/ తాము ఫలానా వాటిల్లో ఆదేశాలు ఇవ్వటానికి కుదరదు అని భళేగా తప్పించుకుంటారే! అప్పుడప్పుడు  కొందరు నిజాయితీగా ధర్మోద్ధరణకు పాటుపడుతున్న దాఖలాలు కన్పిస్తుంటాయి 


2) దురుద్దేశ పూర్వకంగా ఒకరు ఒకేసారి నాలుగు+ వేర్వేరు కవర్లలో ఉత్తరాలు ఒకే చిరునామాకు పంపితే అవి స్వికరించినవారి సమయం వృధా కదా అందులో వ్రాయబడి ఉండే చెత్త చదవటానికి. ఒకేసారి నాలుగు+ ఉత్తరాలు పంపినారంటే .. ఆ పంపినోళ్ళకు .. అవతలివారి సమయం వృధా చేయరాదని ఇంగితం లేదే. ఏకకాలంలో / తరచూ ఉత్తరాలు వేధించేందుకు పంపుతుంటే   న్యాయస్థానాలను రక్షక భటులను ఆశ్రయిస్తే మాత్రం న్యాయం జరుగుతుందా అంటే దాదాపు ~7 ఏళ్ళుగా ఉన్న అనుభవం అనుమానాన్నే కలిగిస్తున్నది.. ఎందుకంటే తప్పు చేసింది ఎవరో స్పష్టంగా తెలుస్తున్నా .. వాయిదాలతో కాలక్షేపం చేస్తున్నారే.. ఉద్యోగం చేసుకుంటూ దేశాభివృద్ధిలో పాల్పంచుకునే  అవకాశం లేకుండా చేస్తున్నాయి ఎందరో భర్తలపై అన్యాయంగా బనాయించబడే కేసులు. అసలు ఈ సమస్య ఎవరికి చెప్తే పరిష్కారం ఔతుంది?



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Useful books in telugu

Useful books in hindi telugu

Useful books from Ramakrishna mission (telugu & Hindi)