మెంటార్లు/ టీచింగ్ అసిస్టెంట్స్ గా పార్ట్ టైం విధానంలో   ఇల్లు / కాలేజీ నుండి పనిచేయాలనే ఆసక్తి  ఉన్నవారికి ఆహ్వానం 

Duration: to join immediately and upto 1st year end sem last exam(Feb 2024). Online payment once in 2 weeks

గౌరవ పారితోషికం  పని క్లిష్టతను బట్టి గంటకి రూ. 40 నుంచి 50 ఇవ్వబడును(నాకు వచ్చే జీతం నుంచి). అంతకు మించి ఇవ్వటానికి అశక్తుడను.. ఇతరత్రా ఖర్చులు ఉన్నందున. Expenses for ph calls/ travel/ stationary.. will be given. 

చేసిన పనికి గుర్తింపు సర్టిఫికెట్ ఇవ్వబడును. 
ఇంటర్న్షిప్ & ఉద్యోగాలకు ఉపయోగించే సిఫార్సు లేఖ కూడా పనితీరును బట్టి ఇవ్వబడును.  

Other benefits:
 gift voucher of rs. 100 / month to buy fruits 
Rs. 100 worth bsnl recharge
Rs. 100 will be paid if u wish to take membership in govt library
Technical internship opportunities in other companies will be told
Sponsored to attend tech fest at IIT upto rs. 500, if u register for some workshop or event there
If u r doing NPTEL course starting in Jan 2024, 50% exam fee will be paid 
These benefits should be used before Feb 2024.


ఎంత పని ఉంటుంది: గరిష్ఠంగా రోజుకి గంట  లేదా వారానికి 5-7గంటలు. మీకు పరీక్షలు ఉన్నప్పుడు ఈ పని చేయనవసరం లేదు.

లక్ష్యం.. బిటెక్  CSE మొదటి సంవత్సరం విద్యార్థులకు జీవితం పట్ల సరైన దృక్పథం అలవర్చటం.. చదువు పట్ల శ్రద్ధ కలిగించటం.

ఖాళీలు: 5(ఇందులో రెండు సీనియర్ అబ్బాయిలకు మాత్రమే)


మీ ఇష్టాయిష్టాలను బట్టి అవసరాన్ని బట్టి ఈ కిందివాటిలో ఒకటి లేదా ఎక్కువ రకాల 
పనులు చేయాల్సి ఉంటుంది:

(1) మీకు కేటాయింపబడే విద్యార్థుల క్లాస్ నోట్స్ అబ్జర్వేషన్ రికార్డ్ పుస్తకాలు సరిగా ఉంటున్నాయా అని వారానికి ఒకసారి పరిశీలించటం
(2) అసైన్మెంట్స్ సరిగా చేశారా  చూడటం
(3) చెప్పిన పని చేయనివారు ఎందుకు చేయట్లేదో గమనించి మీదైన శైలిలో వారిని దారిలో పెట్టటం 
(4) వారి పెద్దలను (బాబాయ్/ పెద్దన్నయ్య/నాన్నగారు) రెండు వారాలకు ఓ సారి సంప్రదించటం.. వారి పిల్లల హాజరు శాతం,  చదువులో ప్రగతి,  మరీ ముఖ్యంగా నడవడిక గూర్చి. మీ  గ్రామం వారైతే నేరుగా కాకుంటే ఫోన్ ద్వారా. 

(5)  introduction to programming సబ్జెక్టును అర్థమయ్యేలా  చెప్పటం  & సందేహాలు తీర్చటం

(6) అటెండెన్స్ రిజిస్టర్ ఏ వారానికి ఆ వారం సరిగ్గా ఉండేలా చూడటం

(7)
కాలేజీలో అందరూ పాల్గొనేలా వివిధ కార్యక్రమాలు పోటీలు నిర్వహించనున్పాం. వాటికి సంబంధించి ప్రశ్నలు, posters, certificates తయారు చేయటం (hardcopy/ soft copy), maintaining excel sheets analysing data and alloting points to individuals based on their activeness and correctness. సంబంధిత సమాచారం కాలేజీలో అందరికీ (బస్ డ్రైవర్లు , ఊడ్చేవారు, సెక్యూరిటీ  సిబ్బందికి కూడా) అందేలా చూడటం .. వాట్సాప్ ద్వారా / ప్రింటౌట్, జిరాక్సులు తీసి నోటీసు బోర్డులో ప్రకటన  కాగితాలు పెట్టడం ద్వారా. 
ఫలితాల ప్రకటన for each of them and బహుమతి ప్రదానం

(8) వారానికోసారి విద్యార్థుల నుంచి రెండు వారాలకు ఓసారి వారి పెద్దలనుండి అభిప్రాయాలు సేకరించాలి..  పురోగతి ఎలా ఉందో గమనించి మన విధానంలో అవసరమైన మార్పులు చేసుకోవాలి 

ఇంకేవైన విద్యా సంబంధిత పనులు ఉంటే చెప్పబడును.

కావాలనే ఈ ప్రకటనను ఎక్కువగా మాతృభాషలో వ్రాయటం జరిగింది.. 

అర్హతలు...
(1) ఇతర భాషలను ద్వేషించకుండా తల్లి భాషను గౌరవించేవారికి మొదటి ప్రాధాన్యత .. మీకు మీ మాతృ భాష లేక ఏదైనా ఒక భారతీయ భాష వ్రాయటం వచ్చివుండాలి. 

(2) cse 1st yearలో ఉన్నది మీ తమ్ముడు / చెల్లెలు అని తలచి ఓ అన్న _అక్కగా వారి శ్రేయస్సు కోరి పనిచేయాలనే తపన ఉండాలి

(3) సాత్విక ఆహారం స్వీకరించటం (/తోలు వస్తువులు వాడకపోవటం)
(4) నడవడిక బాగుంటుంది అని మీ గురించి తెలిసిన అధ్యాపకులు ఒకరైనా సిఫార్సు చేయాలి
(5) లలిత కళల్లో ప్రవేశం ఉన్నవారికి ప్రాధాన్యం
(6) nss, ncc లో ఇదివరకు/ ఇప్పుడు ఉన్నవారికి, ఈ ప్రకటనకు ముందే రక్తదానం వంటి మంచిపనులు చేసినవారికి అవకాశాలు ఎక్కువ 
(7) ఈ కొత్త పని వల్ల మీ స్వంత చదువుకు ఇబ్బంది ఉండకూడదు. మీకు 10th, inter, btech లలో ఇంతవరకు కనీసం 70% వచ్చి వుండాలి
(8) మీరు ఈ పని చేయటానికి మీ పెద్దలు ఒప్పుకోవాలి 

దరఖాస్తు చేయదలిచేవారు తమకు ఎందుకు ఈ పని ఇవ్వవలెనో తెలుగులో వ్రాసి.. intern.padaayi@gmail.com కి
 3-12-23 09:00 కల్లా cv పంపాలి 



ఇట్లు
--
విక్రమ్ భయ్యా
8331926163

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

100% C prog to write content into a file and then read it back onto the console

Spic macay

శ్రీరస్తు.. రామలింగ 18-1-24 (సూరసాని వారి ఆహ్వానము)