మీ పేపర్స్ దిద్దుతున్నా. వాటిల్లో మీరు నీలం రంగులో వ్రాసిన దానికంటే ఎక్కువ నేను ఎరుపు రంగులో  వ్రాయాల్సి వస్తోంది! 

ఇంకా కొన్ని వారాల్లో రెండో పరీక్ష & jntu పెట్టే పెద్ద పరీక్ష ఉంటాయి. ఇక ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా.. పరిణామాలు ఇబ్బందికరంగా ఉంటాయి. గతనెలలో చెప్పినట్లు డిసెంబర్ జనవరిల్లో నేను ఓ నాలుగు రోజులు సెలవు పెట్టాల్సి రావచ్చు .. మనకిక ప్రతీ తరగతి (క్షణమూ) ఆమూల్యమే అని గ్రహించి పూర్తి స్థాయి ఏకాగ్రతతో పాఠాలు వినటం ప్రోగ్రామ్స్ సాధన చేయటం అత్యవసరం.నేనేమీ గొంతెమ్మ కోరికలు కోరట్లే.

డిసెంబర్ చివర్లో హైదరాబాద్ ఇండస్ట్రియల్ విజిట్  సందర్భంగా ఓ 3రోజులు క్లాసులు కుదరకపోవచ్చు‌. ఇంకా కొన్ని hands-on వర్క్ షాప్స్ పెట్టాలని(/పెట్టాల్సిన ఆవశ్యకత) ఉంది. 
మరోపక్క మనం సామాజిక సేవా కార్యక్రమాలకు కొంత సమయం కేటాయించాలి. (చలికాలం కనుక మనం ఇళ్ళలో ఉపయోగించకుండా ఉన్న దుస్తులు సేకరించి అవసరమైనవారికి ఇద్దాం. మీరే చెప్పండి దీనిని సరిగ్గా ఎప్పుడు ఎలా అమలు చేద్దామో.. కార్యకర్తలు కావాలి. ఇలా ఇంకా మనమేం చేయగలమో చేద్దామో ఆలోచించండి/ చర్చించండి బస్సు ప్రయాణంలో)..అయితే వీటి వల్ల మొదటికే మోసం  (అసలుకే ఎసరు) అన్నట్టు మన ప్రోగ్రామింగ్ సబ్జెక్టుకు సమస్యలు రాకూడదు. మనం మరింత బాధ్యతగా మెలగాల్సి ఉంది. 

అనుకోకుండా సెలవు వచ్చినప్పుడు వృధా చేయకండి. చక్కని ప్రణాళిక వేసుకోండి.. రోజూ ఏ సమయంలో ఏమి చేయాలో. ప్రతి రోజూ పడుకునేముందు.. ఆ రోజంతా ఎలా గడిచిందో.. మీ లక్ష్యం ఎంతవరకు నెరవేరిందో.. మరుసటి రోజు ఏమి చేయాలో క్లుప్తంగా వ్రాసుకోండి.. 


మీలో చాలామంది ల్యాబ్ అబ్జర్వేషన్/రికార్డులు వ్రాయలేదు. నేను కాపాడలేను. నిర్లక్ష్యము చేయక (ఇలా) సెలవు వచ్చినప్పుడైనా ఆయా పనులను పూర్తి చేసేయండి. ఈ విషయంలో మీరు ECE , AI& DS  విద్యార్థులు ఏమి వ్రాస్తున్నారో చూడండి. అర్థం చేసుకుంటూ వ్రాయండి. 

కాలేజీకి 7కిమీ లోపు మీరు ఉన్నచో ఆర్టీసీ బస్సులో  వచ్చి ల్యాబ్ చేసుకోండి‌. ఎంత సాధన చేస్తే అంత మేలు. ఏమి నా పిచ్చి.. కాలేజీ బస్సుల్ని సైతం బందరుకు లాక్కెళ్ళ జూచువారు ..ఇక ఆర్టీసీని సామాన్య ప్రజల సౌకర్యానికోసం వదులుతారా! కనుక ఆటోలో రండి.. కుదిరితే(నే). 

ఉచిత సలహాలు నేను ఏకపక్షంగా ఇవ్వటం కాదు. మీరు కూడా స్వేచ్ఛగా మీ భావాలు పంచుకోండి. రానున్న 
రెండు నెలలూ చాలా కీలకం. 

మంగళం భవతు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Spic macay

Assignment to gain eligibility to industry visit

Useful books in telugu