కాలేజీ
బస్సులు నడిపేవారిని మీరు బాబాయ్ అని పిలుస్తున్నారనుకుంటా! వారు పొగత్రాగడం మానేలా చేయటం మీకు సులభమే... సెంటిమెంటల్ గా మాట్లాడటంలో మీరు సిద్ధహస్తులు కనుక. ప్రయత్నం చేయండి. మీరు ఓ నలభై మంది కలిసి వారివద్దకు వెళ్ళి " బాబాయ్.. మీ ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటున్నాం.. *చిన్నపిల్లలమైన* మా మాట కాదనరు అని మాకు గట్టి నమ్మకం.. వాడెవడో సినిమాలో బీడీ తాగితే మీరు అది పాటించటమెందుకు. అలాంటివారు హీరోలు కాజాలరు. ఇదిగో..ఇప్పుడు మీ వద్ద బీడీ కట్ట/ సిగరెట్ పాకెట్ ఉంటే తీసి మా ముందరే చెత్త బుట్టలో వేయండి" అని మీరు మనస్ఫూర్తిగా అడిగితే వారు తప్పక ఆలోచిస్తారు.
ఊడ్చేవారికి / బస్ డ్రైవర్లకు/ సెక్యూరిటీ సిబ్బందికి చదువురాదంటే మీరు అలాంటివారు ఎవరో కనుక్కొని ఆ ఆ లు నేర్పవచ్చు. 15-11-23 కల్లా చదువు రానివారెవరో కొనుక్కోండి. శ్రద్ధ పెడితే వారానికి 2 సార్లు..గంట చొప్పున ఓ నాలుగు వారాలు సరిపోతుంది. అప్పుడు విక్రమన్నయ్య ఇచ్చే చిన్నపిల్లల కథల పుస్తకాలను మీరు సొంతంగా చదువుకోగలుగుతారు అని వారికి చెప్పవచ్చు.
చదువు చెప్పే కార్యకర్తలకు ప్రోత్సాహక బహుమతి= గంటకి వంద రూపాయలు. నేర్చుకునే వారికి గంటకి ఇరవై రూపాయలు. ఇలా పదిగంటలు. డిసెంబర్ లో వారికి సులభమైన పదాలు(ఒకటవ తరగతి పుస్తకం స్థాయి) చదివే పరీక్ష పెడదాం. విజయం సాధించే ఆ 'పెద్ద' విద్యార్థులకు & 'చిన్న'గురువులైన మీకు ప్రశంసాపత్రాలు+ వంద రూపాయలు ఇవ్వబడును.
పొగ మాన్పించడానికి గడువు 27-11-23. మాన్పించడానికి మీరు బృందంగా వెళ్ళండి. బృందానికి బహుమతి రూ. 400. మానిన డ్రైవర్లకు ప్రోత్సాహంగా రూ. 300. ఇస్తారని చెప్పండి
కాలేజీలో ఇంకా ఏమేం మంచి పనులు (భారీ ఖర్చు కానివి..ఆచరణాత్మకమైనవి) చేద్దామో .. అందులో మీరు ఎంతవరకు బాధ్యత తీసుకుంటారో నిర్మొహమాటంగా చెప్పండి.
అప్పుడే దీపావళి!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
దయచేసి మీ సలహాలను సూచనలను స్పష్టంగా పేర్కొనగలరు. plz see that ur comments are 'acceptable' in a value based society.