విజయగాథ

పావన కృష్ణా పరీవాహక ప్రాంతంలో స్వాతంత్ర్య సమరయోధులు, గాంధీ గారి పరోక్ష అనుయాయులు, చిన్నమ్మగారి శిష్యులు ఐన సజ్జనుండొకని మనవని కథ యిది.. 
  అవనిగడ్డ _ కోడూరు ప్రాంతంలో ప్రకృతికి దగ్గరగా బాల్యం గడిచింది. ఇంజనీరింగ్ పూర్తయ్యాక  బహుశా 2013నుండి  ప్రతి యేడూ గేట్ పరీక్షను దీక్షగా వ్రాయటం అంటే మాటలు కాదు. ఆసక్తి పట్టుదల ఉంటేనే సాధ్యమది. ఏదో ఆషామాషీగా కాకుండా తనకున్న గణితాసక్తిని చక్కగా వినియోగిస్తూ ఈ పదకొండేళ్ళూ ప్రతిసారీ గౌరవప్రదమైన ఫలితం పరీక్షలో పొందినాడంటే అది చెప్పుకోతగిన విశేషమే. తనకున్న మంచి అలవాట్లకు & కృషిచేసే తత్వానికి కొన్ని సంవత్సరాల క్రితమే అత్యున్నతస్థాయి విద్యాసంస్థల్లో చదివే అవకాశం రావాల్సింది. అయితే ఎక్కడ ఎప్పుడు దరఖాస్తు చేయాలి అనే విషయంలో తగు మార్గదర్శనం లేక ఆలస్యమైనదనిపిస్తున్నది. మొత్తానికి ఆధ్యాత్మిక వాతావరణం పరిఢవిల్లే ఐఐటీలో పరిశోధన చేసే సదవకాశం తనకు ఇప్పటికి లభించటం రానున్న కాలంలో సమాజానికి గొప్పమేలు చేయనున్నది. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Assignment to gain eligibility to industry visit

Useful books in telugu

త్వరలో తగిన ఉద్యోగం వస్తుంది.. చేసే ప్రయత్నం బట్టి..