శోభకృతుకు (गुड़ी पड़वा) స్వాగతం పలుకుతూ.. ఆటవెలదిలో మూడు ముత్యాలు

పద్యమొకటి వ్రాయి(/చెప్పు) పండుగ నాడైన
జనులు పదుగురైన చదివి మెచ్చ!
అట్లుకానినాడు అదియేటి పర్వమ్ము
రోజు వెనుక (/వెంట) వచ్చు రోజు గాక!

భావము వ్రాయనవసరం లేదు?!.. కొందరైనా చదివి(/విని) సంతసించేలా పద్యము ఒక్కటైనా వ్రాసిన(/చెప్పిన/చదివిన..ఆచరించిన) రోజే పండుగ రోజు అగును. లేక పోతే ఒకరోజు తర్వాత సాధారణంగా వచ్చే మరో రోజు ఔతుందే తప్ప ఇది పర్వదినము అనలేము!


----
జవము కలిగియెప్డు జనులు పనులు జేయు
జయము కల్గునపుడె జగతిలోన
యేడ్పు ముఖము తోడ యేపనిజేసినా
చెడును ఆ పనియని చెప్పనేల?

ఉత్సాహంగా పనిచేస్తే విజయం లభిస్తుంది అని భావము. 'జవము' అనే పదము  బడిలో చదివే రోజుల్లో 'రుద్రమదేవి' పాఠంలో ఉండెను. నిఘంటువు ప్రకారం జవము= వడిగల. ఇక్కడ 'ఉత్సాహము' అనే అర్థంలో ప్రయోగించబడె. (ఇది ఎంతవరకు సబబు?)
----

కొత్త యేడు వచ్చె; కొంగ్రొత్త పద్యమ్ము
చెప్పరయ్య  మాకు చెవులు  పుట్ట!
వినినవారికెల్ల విమలయశముదెచ్చు
మంచిమాట యొకటి మగధరాజ!
(ఇక్కడ 'వినిన' అంటే కేవలం భౌతికంగా చెవిలోకి మాటలు వెళ్ళటం కాదు! విషయం అర్థం చేసుకొని 'ఆచరణలో పెట్టిన' అని భావించాలి)

కింద పేర్కొన్నట్లు దీనినే పలు విధాలుగా వ్రాయవచ్చు..

కొత్త యేడు వచ్చె; కొంగ్రొత్త పద్యమ్ము
చెప్పరయ్య (/చెప్పవయ్య/ చెన్పవమ్మ) మీరు (/మాకు) చెవులు  పుట్ట
వినినవారికెల్ల విశదమగునటుల (/విమలయశముదెచ్చు)
మంచిమాట యొకటి మగధరాజ (/మద్ర భూప!)
(/నీతి వాక్య మొకటి నీరజాక్ష!)

'చెవులు పుట్ట' సుమతీ శతకం నుండి  స్వీకరించబడెను



శోభకృతుకు (गुड़ी पड़वा) స్వాగతం పలుకుతూ.. ఆటవెలదిలో మూడు ముత్యాలు 

తప్పులున్నచో తెలుపగలరు 

ధన్యవాదములు
----
పద్యాల విక్రమ్ కుమార్
8331926163

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Spic macay

శ్రీరస్తు.. రామలింగ 18-1-24 (సూరసాని వారి ఆహ్వానము)

Assignment to gain eligibility to industry visit