ఉద్యోగ అవకాశం : తెలుగు కమ్యూనిటీ డెవలప్ మెంట్ కన్సల్టెంట్ ( ఫుల్ టైమ్ లేదా పార్ట్ టైమ్) – ఇండిక్ వికీ ప్రాజెక్టు
On Mon, 2 Nov 2020, 07:59 विक्रम भय्या vikramkumar, <vikrambhayya@gmail.com> wrote:
ధన్యవాదములు.. పలువురికి చెప్తాను.
ఇట్లు
విక్రమ్ భయ్యా
8331926163On Sun, 1 Nov 2020, 18:10 Kaśyap కశ్యప్, <kasyap.p@gmail.com> wrote:నమస్కారం విక్రమ్ కుమార్ గారు ,
దయచేసి మీకు తెలిసిన తెలుగు అభిమానులకు ఈ ఉపాధి అవకాశము సూచించగలరు, దయచేసి మీకు తెలిసిన తెలుగు వారితో ఈ ఉపాధి అవకాశము పంచుకోగలరు.
ఉద్యోగ అవకాశం : తెలుగు కమ్యూనిటీ డెవలప్ మెంట్ కన్సల్టెంట్ ( ఫుల్ టైమ్ లేదా పార్ట్ టైమ్) – ఇండిక్ వికీ ప్రాజెక్టు
తెలుగు ప్రజలకు ఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వాలు చాలా అరుదు. అందునా మన కంటే తక్కువ జనాభా ఉన్న ఇతర భాషలతో పోల్చుకుంటే మన తెలుగులో చాలా తక్కువ వ్యాసాలు ఉన్నాయి . దీనికోసం ఇండిక్ వికీ ప్రాజెక్టు ద్వారా ఆధునిక పారిశ్రామిక సాంకేతిక యుగంలో విజ్ఞాన సంపదనంతటినీ తెలుగులోనికి అందుబాటులోకి తీసుకు రావాలి అని ప్రయత్నం చేస్తున్నాము , ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ భారతీయ భాషలలో వ్యాసాలు గణనీయంగా పెంచాలన్న లక్ష్యంతో 'ప్రాజెక్ట్ ఇండిక్ వికీ' చేపట్టింది దీనిలో భాగంగా మేము ఈ ప్రాజెక్ట్ లో తెలుగు కమ్యూనిటీ డెవలప్ మెంట్ కన్సల్టెంట్ కొరకు ఆసక్తి గల స్థానిక అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాము . దీనికోసం అంతర్జాలంలో తెలుగులో సమాచారాన్ని అభివృద్ధి చేయడానికి swacchanda కార్యకర్తలను గుర్తించడం, వారిని తెలుగులో రాసే విధంగా ప్రోత్సహించడం, అందుకు కావలసిన సాంకేతిక శిక్షణను అందించడం లాంటివి ముఖ్య కర్తవ్యాలు. ప్రజలకు స్ఫూర్తినిచ్చే నాయకత్వ లక్షణాలు , తెలుగు భాష మీద ఆసక్తి ఉన్నవారికోసం తెలుగునాట ప్రతి జిల్లాలో , ముఖ్య పట్టణాలలో మేము అన్వేషిస్తున్నాము . ఈ ఉద్యోగం మీ ప్రాంతములో నే ఉంటూ ఫుల్ టైమ్ , పార్ట్ టైమ్ లో చేయదగిన సువర్ణావకాశం . దయచేసి మీ వివరాలను ఈ గూగుల్ ఫారం లో ఇవ్వగలరు
https://forms.gle/VqLdBomEbEer74mK8
అర్హతలు :
వ్యవహారిక తెలుగు భాష మీద మంచి నైపుణ్యం ఉండాలి అంటే తప్పులు లేకుండా చక్కటి వాక్యం నిర్మాణం చేయటం తెలిసి ఉండాలి . (తెలుగు పాండిత్యం అవసరము లేదు) .
మొబైల్ లేదా కంప్యూటర్ లో తెలుగులో రాయటం తెలిసి ఉండాలి ( తెలుగు టైపి౦గ్ తెలవాల్సిన అవసరం లేదు )
అధిక స్థాయి చిత్తశుద్ధిని కలిగి అత్యంత పారదర్శక పద్ధతి లో పని చేయడానికి సౌకర్యం గా ఉండాలి .
విషయాలు ఆఫ్ ట్రాక్‌లో ఉన్నప్పుడు లేదా అవసరమైనప్పుడు ఇతరులను తీసుకురావడానికి భయపడని చురుకైన మరియు దాపరికం లేని సంభాషణ కర్త అయి ఉండాలి .
పరిపక్వ పద్ధతిలో విమర్శలను నిర్వహించగలగాలి.
సంస్థాగత నైపుణ్యాలు కలిగి అవసరమైన అన్ని పనులు సకాలంలో మరియు సరిగ్గా పూర్తి చేసేలా చూడాలి.
ప్రాజెక్ట్‌కు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం (మైక్రోసాఫ్ట్ ఆఫీసు, గూగుల్ డాక్స్, అనువాద అనువర్తనాలు) తెలిసి ఉన్నవారికి ప్రాధాన్యత
ఇది Project Based Consultant job , సొంత ల్యాప్ టాప్, ప్రయాణ సౌలభ్యం ఉండాలి. కన్సల్టింగ్ కార్యాచరణకు
మరిన్ని వివరాల కోసం కశ్యప్ 9494466189లేదా వాట్సాప్ 63 01 84 21 20 ను సంప్రదించవచ్చు ఇంటర్వ్యూ ను షెడ్యూల్ చేయడానికి , ఫారం పూరించటంతో పాటు , ప్రొఫైల్‌ను tewiki@iiit.ac.in కు పంపండి.
ఇందులో అర్హులు అయిన వారికి కావాల్సిన శిక్షణను మేము అందచేస్తాము . ఎంపికలను బట్టి మేము అభ్యర్ధికి , కేటాయించబడిన ఇంటర్వు తేదీ, సమయం తెలియచేస్తాము .
సంప్రదింపులు
ఇండిక్ వికీ ప్రాజెక్టు ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హైదరాబాద్ (ఐఐఐటి, హైదరాబాద్)
tewiki.iiit.ac.in 9014120442
ప్రాజెక్ట్ ఇండిక్ వికీ గురించి
ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ భారతీయ భాషలలో వ్యాసాలు గణనీయంగా పెంచాలన్న లక్ష్యంతో 'ప్రాజెక్ట్ ఇండిక్ వికీ' చేపట్టింది శాస్త్ర , సాంకేతిక అంశాల వ్యాసాలు , దానికి సంబంధించిన సమాచారం స్వేేచ్ఛ గా , ఉచితంగా తెలుగులో అందరికీ అందుబాటులో ఉండాలి అన్న లక్ష్యం తో .తెలుగుతో సహా అన్ని భారతీయ భాషల్లో వ్యాసాల సంఖ్యను పెంచడం ద్వారా వికీ సుసంపన్నం చేయడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. తెలుగు ప్రాంతంలో సమాజానికి మేలు చేసే ప్రత్యేక, అత్యంత దృశ్యమాన ప్రాజెక్టుగా ఇది గుర్తింపు పొందింది. భారతీయ భాషల్లో (తెలుగు, హిందీలపై దృష్టి కేంద్రీకరించడం) వికీపీడియా కంటెంట్ ను పెంపొందించే ఈ ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని ఈ ప్రాజెక్టు ద్వారా మేము చేపట్టాం.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
దయచేసి మీ సలహాలను సూచనలను స్పష్టంగా పేర్కొనగలరు. plz see that ur comments are 'acceptable' in a value based society.