పోస్ట్‌లు

ఫిబ్రవరి, 2024లోని పోస్ట్‌లను చూపుతోంది

Gate' 2024 ప్రశ్నలలో కొన్నిటికి జవాబులు

Gate ప్రశ్నలలో కొన్నిటికి  జవాబులు https://youtu.be/FL11nl2jCBc   (04:14) https://youtu.be/ISKzo8k7FGg  (09:12; close it after 8:30) https://youtu.be/n0CYt41LhZs  (25:52) 
నమస్కారము.. ఆర్యులారా! తమరు శ్రమ తీసుకుని వ్యక్తిగతంగా సందేశాలు పంపవలదు. ఎన్నో వస్తాయి కనుక నేను అన్ని సందేశాలు చూస్తూ వుండలేను. అన్యధా భావించవద్దు. మీ సమయం వృధా చేయకండి. ముఖ్యంగా ఫలానా  సాంస్కృతిక/ సాంకేతిక కార్యక్రమాలు ఫలానా చోట ఉన్నాయి అని ముందుగానే పంపితే వీలును బట్టి హాజరు కాగలను లేక కనీసం ఇతరులకు చెప్పగలను. Plz don't waste ur time in sending personal messages to me unless very imp. I will not be able to check what all comes in WhatsApp or mails. If there r classical cultural programs/ technical workshops.. try to send such info well in advance (avoid big size files) so that I may attend or will be able to forward to some more. धन्यवाद

రైలు తుంగభద్ర దాటబోవ మదికిట్లు తో(/దో)చె!

1. తుంగభద్ర కూడ(/ చూడ) తూర్పుకు ప్రవహించు 2. అట్లు కాకయున్న అదినదమగు; 3. పటమునందు(/పల్లమునకు) కుడికి పరుగెత్తువానిని 4. నదులటంచు పిలుచు నరులు యిలను! ఉదాహరణకు నర్మద & తపతి పడమరకు ప్రవహిస్తాయి.. వాటిని 'నదాలు' అంటారు.

నిష్కామ కర్మ ముఖ్యం..

కోరిక లేకుండా పూజ చేయాలి! ఏమి ఎంత ఎప్పుడు ఎవరికి ఎందుకు ఇవ్వాలో తనకు తెలుసు కనుక ఈ క్రింది పద్యము వ్రాయవలసి వచ్చినది.. 1.ఎవరికెప్డు ఎంత ఏమీయవలయునొ 2.తల్లికెఱుక గాన తననదియిదనుచు 3. తనయు(/య)లడుగనేల? తత్పదముల నమ్మి 4. గొలుచువారికిలను కొరతయేమి? 4. పనులు చేయువారు ప్రగతి నందు 4. పనులు సలిపినంత ప్రగతి కలుగు  4. పనులు సేయ మంచి ఫలితమొచ్చు

వసంత పంచమి సమీపిస్తున్న తరుణంలో...

ఆటవెలదితో అమ్మకు వేడుకోలు.. 1. వాక్కు శుద్ధి కోరి వాణినుపాసించు 2. విక్రముండు యెంతొ విమల భక్తి 3. తోడననవరతము; దోర్బల పాండితి 4. కరుణనిమ్ము తల్లి కల్పవల్లి  4. కరుణ నీయవమ్మ కరువు దీర 4. కరుణ నీయవమ్మ కమలనయన 4. నిచ్చి కావవమ్మ నీలవేణి 4. నాకొసంగరాదె నలువరాణి