28-10-23 కార్యక్రమానికి హాజరుకావాలని ఈపాటికే గట్టి నిర్ణయానికి వచ్చినవారికే ఈ పోటీలు



గమనిక.. మీరు చేసేవి ఏవైనా ఉదాత్తంగా ఉండాలి. భయంకరమైన శబ్దాలు వద్దు. fast blinking lights/ flash lights are not good for health. కుటుంబ సభ్యులందరూ కలిసి వినతగినవి/ చూడతగినవిగా ఉండాలి. try to get study material & career guidance from seniors
ఈ కింద పేర్కొన్నవి  
 ఒంటరిగా  లేక బృందంగా పాడే వారికి/ సంగీత పరికరంపై పలికించవచ్చు   
(1)  చలనచిత్రాల్లోని ఉదాత్తమైన/ సందేశాత్మక పాటలు (పాటకి/ తలకి యాభైవరకు బహుమతి)
   (అ)  పాడవోయి భారతీయుడా..ఆడిపాడవోయి భారతీయుడా.. 
   (ఇ)  ఏరువాక సాగాలో రన్నో చిన్నన్న .
   (ఉ) .గాంధీ పుట్టిన దేశం.. రఘురాముడు ఏలిన రాజ్యం..ఇది సమతకు మమతకు సంకేతం
   (ఎ)  నలుగురు కలిసి ..పొరుపులు మరచి చేయాలి ఉమ్మడి వ్యవసాయం.. 
   (ఒ)   నీ సంఘం.. నీ ధర్మం. నీవు మరవద్ధు.. 
   (క)   శ్రీకర కరుణాలవాల.. వేణుగోపాలా (తల్లిదీవెన పాట .. భానుమతి)
   (ఖ)  భలే తాత మన బాపూజీ 
   (గ)   మత్తువదలరా .. నిద్దుర మత్తు వదలరా.. 
   (చ) తెలుగు భాష తియ్యదనం .. తెలుగు జాతి గొప్పదనం తెలుసుకున్న వారికి తెలుగేఒక
   (జ) కొంతమంది సొంత పేరు కాదుర గాంధీ.. ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ
(*last 2 are recommended to me by my students in 2013-14)
మొదటి రెండు తప్ప మిగిలిన వాటికి మీరు ఎక్కువమంది వేదిక ఎక్కి తగిన  అభినయం  కూడా చేయవచ్చు

 (2) శాస్త్రీయ సంగీతం .. భక్తి వైరాగ్య..కీర్తనల్లో ఓ సందేశాత్మకమైనది..కింద పేర్కొన్నవి ఉదాహరణకు మాత్రమే..(పాటకి/ తలకి యాభైవరకు బహుమతి)
    (అ)  నానాటి బతుకు నాటకము...
    (ఇ)  ఎన్నడు విజ్ఞానమికనాకు..విన్నపమిదె
     (ఉ)  భావములోన .. బాహ్యమునందును..

 (3)  సందేశాత్మక ఏకాంకిక/ లఘునాటిక  (అంశానికి/ తలకి యాభైవరకు బహుమతి)/ ఏకపాత్రాభినయం.. మీరు స్వయంగా సంభాషణలు వ్రాసుకోవచ్చు / లేక ఇతరులు వ్రాసినవి స్వీకరించవచ్చు
      (అ) విద్యుత్ వృధా చేయరాదు
      (ఇ)  నీరు వృధా చేయరాదు
      (ఉ) సమయం వృధా చేయరాదు
      (ఎ)  కలిసి ఉంటే కలదు సుఖం (పెద్దలు విడిపోతే పిల్లలకు న(/క)ష్టం!) / ఉమ్మడి కుటుంబం
      (ఒ)   పిల్లలు బడికి..పెద్దలు పనికి (సర్వ శిక్ష అభియాన్)
      (క)    యుద్ధం వద్దు
      (ఖ)   అహింసా పరమోధర్మః 
      (గ)    ఆచార్యదేవోభవ
      (జ)   సెల్ ఫోన్ తో తంటాలు 

(4)  పౌరాణిక పద్య వైభవం (పాటకి యాభై/ పద్యానికి పాతిక). అవసరమైతే సన్నివేశానికి తగినట్లు ఎక్కుమమంది వేదికపై అభినయం కూడా చేయవచ్చు

      (అ) భక్త ప్రహ్లాద చలన చిత్రంలో ప్రహ్లాదుడు పాడిన పాట లేక పద్యం (సినిమాలో చివరి గంటన్నరలో)  ..ఉదాహరణకు  (i)కరుణ లేని జన్మ కఠిన పాషాణమ్ము     (ii) ఆదుకోవయ్యా..   (iii) కనులకు వెలుగువు నీవేకావా (iv) మందార మకరంద   (v) ఇందుగలడందు లేడనుచు సందేహంబు వలదు
       (ఇ) (i)లవకుశులు తల్లిని ఓదారుస్తూ పాడినపాట *ఊరకే కన్నీరు నింప కారణమేమమ్మా ::* (ii) లక్ష్మణుడు సీతమ్మవారివద్ద సెలవు తీసుకునేప్పుడు పాడిన పద్యం ..*ప్రతిదినమేను తొలుదొల్తపాదములంటి నమస్కరించి..*
        

(5) ఘంటసాల పాడిన దేశభక్తిపాటలు..(పాటకి యాభై)
      (అ) వెలిగించవోయి ఉజ్జ్వలమైనశోభతో..
      (ఇ)  ఆ మొఘల్ రణధీరులు..తంతియాతోపె, ఝాన్సీలు.. 
      (ఉ)  కళ్ళుమూసుకొని వళ్ళుచూసుకొని కాలం గడపకు తెలుగోడా..
       (ఎ)  లెమ్మురా ..లెమ్మురా ..లెమ్ము ఆంధ్రుడా.. ఆంధ్రజనని సేవజేయరమ్ము  ఆంధ్రుడా

(6) arvind gupta toys telugu లో ఉన్నటువంటివి చేసుకొచ్చి ఓ రెండు నిమిషాలు వేదికపై దానిని గూర్చి వివరించటం (తలా యాభై వరకు)
(7) కోలాటం (మూడు నుండి ఐదు నిమిషాలు)..  (తలా యాభై వరకు)
(8) శాస్త్రీయ నృత్యం (తలా నాలుగువందల రూపాయల వరకు)

 మొత్తంమీద రెండువేలరూపాయలకు మించకుండా ప్రోత్సాహక బహుమతులు (నగదు/ పుస్తక రూపంలో) ఇవ్వబడును.  
Hope you will maintain decency. అన్నదమ్ములు అక్కాచెల్లెళ్ళలా మెలగుతూ  కార్యక్రమాన్ని జయప్రదం చేసుకోగలరు.  Plz remember that u have internals in November!
*భయ్యా హాజరుకాడు.    పేరు నమోదుకు  https://forms.gle/jURGgdVKveQoJPvc7

   సౌజన్యం =  భారతిలిపి (bharatiscript.com)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

100% C prog to write content into a file and then read it back onto the console

Spic macay

శ్రీరస్తు.. రామలింగ 18-1-24 (సూరసాని వారి ఆహ్వానము)