ఇస్రో విజయయాత్ర

ఆటవెలది

దర్శనం కోసం కూర్చోబెడితే ఆలోచనలు ఆగుతాయా?

ఇస్రో విజయయాత్ర

శాస్త్రవేత్తలకును సామాన్య జనులకున్
సంతసంబుకలిగె; సందమామ
సంగతులను తెలియ సాధ్యమౌననివిని
ఉత్సవాలు చేసె ఊరివారు (/ఊరి జనులు)


----
1. నింగిలోన నుండి నిక్కెడు జాబిల్లి
2. గుట్టుతెలియగోరి గురుతరమగు
3. పనికి పూనుకొనిరి పరిశోధకుల్ ఉర్వి (/ధాత్రి)
3. కార్యమొకటి పూనె కష్టమునెంచక
4. జనులు సంతసించి జయముపలికె(/పలుక)

----

1. వేచిచూచువేళ వేసట చెందక
2. వెంకటేశు భజన వేడ్క తోడ(/మీర)
3. వేలమంది చేయ వెన్నుడు మదిలోనె(/తృటిలోన)
4. గోచరించుగాదె గోడు తీర్ప (/గోస దీర/ గోస తొలగ)

దైవ దర్శనానికి గంటల సమయం పడుతుందని వాపోయి అయిష్టంగా గుడికి  వేళ్ళే బదులు  ఇలా కూర్చున్నంతసేపు పద్యాలు వ్రాసుకుంటే/ పాడుకుంటే సరి?!



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

100% C prog to write content into a file and then read it back onto the console

Spic macay

శ్రీరస్తు.. రామలింగ 18-1-24 (సూరసాని వారి ఆహ్వానము)