రోబోటిక్స్ తరగతులు Robotics Classes
নমস্কাৰ/ नमस्कार / నమస్కారము /ನಮಸ್ಕಾರ/ வணக்கம்/ નમસ્તે/ ସୁପ୍ରଭାତ/ നമസ്കാരം
రోబోటిక్స్ తరగతులు (14-5-22 లేక అంతకు ముందే మొదలగును)
ఇందులో భాగంగా కొన్ని సైన్స్ ప్రాజెక్ట్స్ ఎలా చేయాలో చెప్పబడును. ప్రాధమిక అంశాలతో మొదలుపెట్టబడును. పాల్గొనేవారికి కాస్త ఓపిక అవసరం.
పాల్గొనేవారు(వ్యవహారం కోసం శిష్యులు అందాం) జీవన పర్యంతం బోధకునిపై ఆధారపడి వుండేలా కాకుండా.. కొన్ని గంటల శిక్షణ పిమ్మట 'తమంత తాము మరిన్ని నేర్చుకోనేస్థాయికి' తీర్చిదిద్దటం ఈ కార్యక్రమ లక్ష్యం.
పాల్గొని నేర్చుకునేవారు పలువురికి తమ ఙ్ఞానాన్ని పంచాలని ఆకాంక్షిస్తున్నాం. తద్వారా 'మనుషులు' సరైనవాటికి తమ విలువైన సమయం కేటాయించటం అలవాటు చేసుకుంటే సమాజం సద్భావపరిమళాలు వెదజల్లుతుంది.
ఆన్లైన్ క్లాస్ రికార్డ్ చేయబడును. ఇది అభ్యంతరకరమని భావించేవారు పాల్గొననవసరం లేదు.
అవసరమైనప్పుడే మైకు/ కెమెరా ఆన్ చేయటం.. సందర్భోచితంగా అవి ఆఫ్ చేయటం ముఖ్యం.
దీనికంటూ ఒక నోట్ పుస్తకం పెట్టుకోగలరు. ఏరోజు ఏమి చెప్పుకున్నాం/ చేశాం అందులో వ్రాసుకోవాలి.
ప్రాధమికంగా ఈ తరగతులు ధార్మిక విషయాసక్తికలిగిన కుటుంబాల పిల్లలకోసం (7వ తరగతి & ఆ పై స్థాయి విద్యార్థులకి ఎక్కువ ఉపయోగకరం. పెద్దగా(/అసలు) చదువుకోని 'పెద్దలకు' కూడా సులభంగా అర్ధమయ్యేలా చెప్పబడును).
వారానికి రెండు తరగతులు (ఒక్కోటి ఒక గంట చొప్పున) zoom ద్వారా చెప్పబడును. శని/ఆది కావచ్చు. ఎక్కువమందికి అనువైన విధంగా పెట్టుకుందాం. ప్రత్యేక పరిస్థితుల్లో .. సమయంలో మార్పు ఉంటే ముందుగా చెప్పగలము. ప్రస్తుతమైతే హైదరాబాద్ లో కరెంట్ కోతల్లేవు.. వార్తలు చదివే/వినేవారికి తెలుసు.. మున్ముందు ఎలా ఉండబోతోందో! మొదట ఓ ఎనిమిది తరగతులు కానివ్వండి. ఆపాటికే మీరీ కింద పేర్కొన్నవి నేర్చుకోగల్గుతారు
1 సెల్ఫోన్ లో ఒకటి రెండు వంటివి నొక్కుతూ రోబోట్ ని (చిన్న బొమ్మ కారును) ముందుకు వెనక్కు కదిలేలా చేయటం
2 సెల్ఫోన్ లో ఒకటి రెండు వంటివి నొక్కుతూ లైటు/ ఫ్యాను వంటివి ఆన్ ఆఫ్ చేయటం (షాక్ కొట్టకుండా జాగ్రత్త వహించాలి కనుక ఇది మరీ చిన్నపిల్లలకు చెప్పబడదు!)
3 మీరున్న చోటినుండి గోడ ఎంతదూరంలో ఉంది
4. ట్రాఫిక్ లైట్స్ నమూనా
ఇలా కనీసం ఓ పది ప్రయోగాలు (చిన్నా పెద్దా కలిపి) నేర్చుకుంటారు
ప్రయోగాలు మీరు చేయుటకు కొన్ని వస్తువులు/ ఉపకరణాలు/ పరికరాలు అవసరమౌతాయి. అవి మీ సమీప నగరంలో లేక ఆన్లైన్ లో కొనుక్కోవచ్చు. మాకు దుకాణం లేదు! మేము విక్రయించట్లేదు!! . ఓ మూడు వందల రూపాయల ఖర్చుతో కొన్ని 'ప్రాధమిక ప్రయోగ వస్తువులను' మీరు సమకూర్చుకోవచ్చు మీ సమీప పట్టణం నుండి. మొదటివారంలోనే కొననవసరం లేదు. ఏయే ప్రయోగాలు చేయాలి/ ఎన్ని చేయాలి అనేదాన్ని బట్టి మీకు వెయ్యిన్నర రూపాయలు అదనంగా ఖర్చుకావచ్చు. అవేవీ కొనకుండానే కంప్యూటర్ లో సిమ్యులేషన్ ద్వారా కూడా ప్రయోగాలు చేయవచ్చు కనుక చింతవలదు. కంప్యూటర్ లేనివారు కంగారుపడనవసరం లేదు.
పాల్గొనదల్చువారికి 'ఇంటిపని'/ అసైన్మెంట్స్ ఇవ్వబడును. అవి శ్రద్ధతో చేసేవారికి అధిక ప్రయోజనం కలుగుతుంది.
బోధనకుగాను డబ్బుతీసుకోవలసిరావటం మాకు ఇబ్బందిగా ఉన్నది. ఐతే లౌకిక జగత్తులో 'పనులు' జరుగుటకు ఎంతో కొంత విత్తమవసరం కనుక 'భగవదర్పన' భావంతో పాల్గొనదల్చినవారి నుండి ఎనిమిది గంటలకు గాను నాలుగు వందల రూపాయలు స్వీకరింపబడును. డబ్బుచెల్లిస్తేనే పాఠం చెప్తాననేవారు గురువులు కారని మీకు తెలుసు!
స్థోమత లేనివారు ఉచితముగా తరగతులకు హాజరౌతామన్నా అభ్యంతరము లేదు. ఈ కార్యక్రమానికి సంబంధించి మీరు మొదటి ఎనిమిది గంటలకుగాను నాలుగు వందలకన్నా ఎక్కువ రూపాయలు ఎవరికైనా చెల్లిస్తే నాకు సంబంధం లేదు!
బహుమతి.. ఇంటర్నెట్ లో 'aravind gupta toys telugu' అని వెతికితే వందలాది సైన్స్ ప్రయోగాలు వస్తాయి..ఒక్కోటి రెండు మూడు నిమిషాలే.. చాలావరకు ఇంట్లో/ మీ ఊరిలో లభించే వస్తువులతో ఒక్కోటి సుమారు వంద రూపాయల లోపు ఖర్చుతో సులభంగా చేయవచ్చు.
ఈ తరగతులు 'మనుషుల'కోసం => సత్య భాషణం/ జీవ కారుణ్యం కలవారికే(శాకాహారులకే)
ఈ సందేశం ఆంగ్లములో కూడా ఉన్నా 'తెలుగువారైన తమరు' మాతృభాషా పరిరక్షణకు కంకణం కట్టుకున్నవారై తెలుగులో చదివినందుకు ప్రత్యేక ధన్యవాదములు.
Robotics Classes(will begin on or before 14-5-22)
If you are a Telugu person, please read the Telugu version 1st. If u keep avoiding reading your mother tongue, problem escalates. So even if it is slightly difficult, take help of your elders and read Telugu version of this message. As a temporary solution, you can at least listen when they read it for you.
The intent of these classes is to keep ppl busy with 'progressive activity' so that the man hours get effectively utilized & results in a healthy society.
As a teacher, I wish that ppl uses the available time for 'constructive purpose'
The online classes will be recorded(whenever possible) and will be kept in internet for free use(open access).
8 classes (~1hr each) within 1 month. Mostly Sat/ Sun. Timings can be decided based on the convenience of majority participants. We generally prefer early mornings/ late evenings. If there is any change in schedule due to unavoidable reasons, it will be intimated in advance(as far as possible)
By the end of 8 hrs, you will be comfortable in doing
(1) Controlling a toy car with cell phone
(2) Controlling lights/ fans with cell phone
(3) Project to find the distance of the wall from the place where you are sitting in a room
(4) Traffic light system
At least 10 projects (small to big with and without the need of computer) will be taught. So don't worry if computer is not available.
Fee: Indian rupees four hundred only (~8 hours). Please don't pay anything more than this and I am not responsible for it if u pay more.
For doing the experiments yourself, you may need to buy some components from near by city / online. Based on what/ how many you want to do you may have to spend another Rs. 1500 for it. We are not sellers. We don't have any shop. We only teach.
Assignments (science based and general which help in overall personality development) will be given regularly. Participants are supposed to do such home work sincerely and submit on time
Gift 1: One can find 'Hindi Unity' app, 'Tamil Unity 'App, and 'Telugu unity' android Apps (non-addictive) available in the play store to be useful
Gift 2: Please search in internet 'Arvind gupta toys hindi'. U will see hundreds of science experiments (2–3 minute duration each) which can be done with items at home by spending as littles as Rs. 100 per experiment
If the participant is from Jammu & Kashmir/ Sikkim/ states in the North-east part of India/ Bihar; Countries like Ukraine/ African countries/ Afghanistan/ Srilanka/ Bhutan/ Nepal/ MayanmAr/ Bangladesh/ Pakistan (because we want united India & if my teaching can help in building goodwill that is welcome) & other deserving countries, they are exempted from paying the fee
These classes are for 'Human beings only' => Those who speak truth/ Core Vegetarians
Useful links
శాస్త్ర విషయాలు తెలుగులో www.scienceintelugu.blogspot.com
ఐఐటీ అధ్యాపకుల పాఠాలు www.nptel.ac.in
శాస్త్ర ప్రయోగాలు మాతృభాషలో www.arvindguptatoys.com
శాస్త్ర ప్రయోగాలు చేయుటకు www.vigyanprasar.gov.in
Science in Tamil http://kaleidoscopetamil.blogspot.com/
ప్రభుత్వ ఉద్యోగాలకోసం www.employmentnews.gov.in
నెలకు ౩ పోటీల్లో పాల్గొనుటకు https://www.mygov.in/home/do/
మరిన్ని మంచివి = www.bharatiscript.com https://ndl.iitkgp.ac.in
హైదరాబాద్ లో చూడాలి = బిర్లా సైన్స్ మ్యూజియం / సంజీవయ్య పార్కు లోపల Do Science/ అఫ్జల్ గంజ్ _ అశోక్ నగర్ గ్రంథాలయాలు/ త్యాగరాయ గానసభలో శాస్త్రీయ కళాప్రదర్శనలు/ బాలానంద కేంద్రం/ బాల్ భవన్
తిరుపతిలో చూడాలి = అలిపిరి సమీపంలోని సైన్స్ సెంటర్ / శ్వేత గ్రంథాలయం/ సాయంత్రం వేళల్లో / గోవిందరాజస్వామి కోనేరు _ అన్నమయ్య కళామందిరం_మహతి వంటిచోట్ల సాంస్కృతిక కార్యక్రమాలు
धन्यवाद:/ നന്ദി / ధన్యవాదములు/ நன்றி/ ধন্য়বাদ / ಧನ್ಯವಾದಗಳು/ આભાર/ ਧੰਨਵਾਦ/ ଧନ୍ୟବାଦ
----
पि. विक्रम कुमार పద్యాల విక్రమ్ కుమార్ Pingili Vikram Kumar
Science Communicator
8331926163
http://www.linkedin.com/in/विक्रम-విక్రమ్-vikram-कुमार-కుమార్-kumar-85424172
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
దయచేసి మీ సలహాలను సూచనలను స్పష్టంగా పేర్కొనగలరు. plz see that ur comments are 'acceptable' in a value based society.