యూనివర్సిటీ అడ్మిషన్‌ ఫీజును కోర్టే చెల్లిస్తుంది’అని జస్టిస్‌ దినేశ్‌ కుమార్‌ సింగ్‌ పేర్కొన్నారు

యూపీకి చెందిన విద్యార్థిని సంస్కృతి రంజన్‌ ఇటీవల జేఈఈ పరీక్షలో 92.77 పర్సంటైల్‌తో ఉత్తీర్ణత పొంది 2,062వ ర్యాంకు సాధించింది. ఎస్సీ కోటాలో మంచి ర్యాంకు పొందిన ఆమె బీహెచ్‌యూలో ఐదేళ్ల మ్యాథమెటిక్స్‌ అండ్‌ కంప్యూటింగ్‌ కోర్సులో చేరాలని భావించింది. కానీ.. ఆమె కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. పేదరికం.. పైగా ఆమె తండ్రి కిడ్నీ సమస్యతో డయాలసిస్‌ చేయించుకుంటున్నారు. దీంతో అడ్మిషన్‌ ఫీజు చెల్లించేందుకు తనకు మరికొంత గడువు ఇవ్వాలని జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీని అభ్యర్థించినా ఫలితం లేకుండా పోయింది.

యూనివర్సిటీలో అడ్మిషన్‌ ఫీజు చెల్లించలేక తీవ్ర నిరాశకు గురైన సంస్కృతి.. ఇద్దరు న్యాయవాదుల సాయంతో అలహాబాద్‌ హైకోర్టును ఆశ్రయించింది. తనకు ఎలాగైనా యూనివర్సిటీలో అడ్మిషన్‌ ఇచ్చేలా వర్సిటీ యాజమాన్యాన్ని, కేంద్ర విద్యాశాఖకు ఆదేశించాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్‌ దినేశ్‌కుమార్‌ సింగ్‌ ఆ అడ్మిషన్‌ ఫీజు రూ.15వేలు తామే చెల్లిస్తామని వెల్లడించారు. 'ఎంతో బాగా చదువుకుంటున్న విద్యార్థిని ఫీజు చెల్లించలేక ఇబ్బంది పడుతోంది. ఆమె తండ్రి అనారోగ్యంపాలవడంతో ఫీజు చెల్లించే స్థోమత వారికి లేకుండాపోయింది. విద్యార్థిని కుటుంబ ఆర్థిక పరిస్థితి పరిగణలోకి తీసుకొని యూనివర్సిటీ అడ్మిషన్‌ ఫీజును కోర్టే చెల్లిస్తుంది'అని జస్టిస్‌ దినేశ్‌ కుమార్‌ సింగ్‌ పేర్కొన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

100% C prog to write content into a file and then read it back onto the console

Spic macay

శ్రీరస్తు.. రామలింగ 18-1-24 (సూరసాని వారి ఆహ్వానము)