త్వరలో తగిన ఉద్యోగం వస్తుంది.. చేసే ప్రయత్నం బట్టి..

త్వరలో తగిన ఉద్యోగం వస్తుంది.. చేసే ప్రయత్నం బట్టి..

హితము కోరి చెప్పే మాటలు కటువుగా ఉండటం సహజమే!  ఈ అన్నయ్య సలహాలు సరిగా తీసుకుంటే మీకు మేలగును

 గతంలో ఇతర అధ్యాపకులకు చూపించలేదు కాబోలు... చూపించి ఉంటే వారు ఈ కింది ఉన్న సలహాలు ఇచ్చేవారు.. మీకు ఈపాటికే ఉద్యోగం వచ్చేది

తప్పులు వెతుకుతున్నాం అనుకోవద్దు.. ఇంతవరకూ ఉద్యోగం రాకపోవడానికి CV సరిగా లేకపోవడం కూడా కారణం కావచ్చు ..



  CVలో  చేసిన ప్రాజెక్ట్స్ వివరాలు ఏవి? 2 లైన్లలో చేసిన  ఒక్కో ప్రాజెక్ట్ గురించి

చెప్పటం  Github లింక్ కూడా ఇవ్వాలి

టెక్నికల్ స్కిల్స్ ఏవి?   ఉదా … C (5/10), Java(7/10)   


 మీ స్కిల్స్ నిరూపించుకునేందుకు ఇంటివద్దైనా / కాలేజ్ లో ఐనా (మీరు నిజాయితీగా నేర్చుకుంటానంటే కాలేజ్ అధ్యాపకులు వద్దనరు...for next 2 months..afterwards bcoz juniors will also come..then there may be difficulty to give u system)

U can see how other students r doing projects even if they don't need a job immediately...ఇతరులతో పోల్చుకొని నిరుత్సాహపడమని కాదు... స్ఫూర్తిపొంది మీరూ చేయాలని!  ఉదాహరణకు the work of other interns = 

if u see 1st 2 min and last 3 min. u will understand don't waste time by seeing fully!


https://lnkd.in/grXZxbH (interfacing octave & arduino by ఋషభ్)

ఇవన్నీ సిలబస్ లో లేవు అనవద్దు. ఆసక్తి ఉంటే నేర్చుకునే దారులెన్నో.. nptel.ac.in

Objective వాక్యాన్ని\ స్వంతంగా వ్రాయాలి.  ప్రస్తుతం ఉన్న వాక్యం కాపీ కొట్టినట్లు ఉంది. మీ
 క్లాస్ లో దాదాపు అందరూ అదే వ్రాసి ఉంటారు. అలాగే ఇతర కాలేజ్ వారు కూడా.   So when u all apply for placement drive..the person who read CV s of so many students..తనకు చిరాకు వస్తుంది ..అందరూ అదే వ్రాశారు అని.. 

Objective అనేది మనసులో నుండి వచ్చిన మాటగా ఉండాలి.. దానిని మొదట మాతృభాషలో కాగితం పై వ్రాసి అప్పుడు ఇంగ్లీష్ లోకి అనువాదం చేయాలి. చిలకపలుకుల లాగా కాపీ కొట్టరాదు

పిన్ కోడ్ వ్రాయలేదు.. ఇంటికి offer letter ఉత్తరం ఎలా వస్తుందండి? బి.టెక్ పూర్తైన వారికి చిరునామా వ్రాయటం తెలియాలి కదా! (ఐనా... అడిగితే తప్ప చిరునామా వ్రాయవద్దు).. ప్రభుత్వ ఉద్యోగం ఐతే చిరునామా మొదటే ఇవ్వాలి. At the end before declaration.. ఈ వాక్యం పెట్టవచ్చు.. 'further information will be provided as and when required'   

భవాని/ ప్రసన్న వంటి పేర్లు ఉన్న వారు తాము అబ్బాయి/ అమ్మాయి అని వ్రాయటంలో అర్థమున్నది. మీ CVని భారతీయులకే పంపుతున్నంతకాలం ...వారికి తెలుస్తుంది ...పేరునిబట్టే అమ్మాయి// అబ్బాయి అనే సంగతి. 
అలాగే పుట్టిన రోజు వ్రాయనవసరం లేదు. U can mention year of birth if needed, bcoz ur education table will tell when u r born appro.

ఫోటో పరిమాణాన్ని 80% కి తగ్గించవచ్చు. 

References ఇవ్వలేదు (మీ గుణగణాలు/పనితీరు తెలిసిన ఇద్దరు అధ్యాపకుల వివరాలు ఇవ్వవచ్చండి: పేరు designation, dept, college, official mailid)
 

CV date అక్టోబర్ 2020 అని ఉంది. అప్పటి నుంచి update చేసే తీరిక దొరకలేదంటే ఎలాగండి? కనీసం తోటివారి సాయంతో update చేయొచ్చు కదా. కంపెనీ వారు ఇది నిర్లక్ష్యం అనుకునే అవకాశం ఉంది కదా! నిజమే మీకు కంప్యూటర్ లేదు.. కాలేజ్ లో ఉచితంగా అందుబాటులో ఉంది కదా.. ఉపయోగించుకోవచ్చు.. ఎవరు వద్దంటారు.. 

చేసిన ప్రాజెక్ట్స్ వివరాలు ఏవి? 2 లైన్లలో చేసిన  ఒక్కో ప్రాజెక్ట్



గురించి చెప్పటం



  Github లింక్ కూడా ఇవ్వాలి



టెక్నికల్ స్కిల్స్ ఏవి?   ఉదా … C (7/10), Java(5/10)   



'ఆచార్య ABCD' గారి ద్వారా మీరు మొదట 6-2-21 న 'పని' ఇప్పించండి అని మెయిల్ లో అడిగారు. ఎలాంటి పని చేయగలరో చెప్పండి అని అడుగగా ఏప్రిల్ వరకు జవాబు లేదు! 


ఏప్రిల్ లో మళ్ళీ అదే ప్రశ్న.. పని ఇప్పించండి అని.. కనీసం 9 రకాలు (ఇంకా ఎక్కువే కావచ్చు) చెప్పితిని.. కంప్యూటర్ లేకున్నా చేయగలిగేవి.. ఇంట్లో పరిస్థితులు సరిగా లేవేమో..  కొంత పని చేశారు కానీ ఆ చేసిన తీరు 'సహజ ఉత్సాహంతో' చేసినట్టు లేదు.. ఐతే దీనికి కారణం మీకు ఉన్న ఆర్థిక ఒత్తిడి .. ఇతర పనులపై దృష్టి పెట్టలేని పరిస్థితి కావచ్చు 

ఎవరినీ తప్పు పట్టలేము...విషయం పూర్తిగా తెలీకుండా

[ మరీ అవసరమనుకుంటే ఆడియో / వీడియో Cv కూ డా తయారు చేసుకోవచ్చు. ఇవి ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబిస్తాయి. 
 ... ఐతే  ఇలాంటి విషయాల్లో   Senior faculty/ మహిళా అధ్యాపకుల సలహాలు కూడా తీసుకోగలరు]   


ఇవన్నీ ఇక్కడ వ్రాసింది మీ ఒక్కరికోసం కాదు. ఇవి ఇతర  విద్యార్థులకు కూడా  ఉపయోగపడుగాక.   మీ తరగతిలో ఇతర తమ్ముళ్ళు చెల్లెళ్ళకు కూడా ఉపయోగపడతాయివి. మరి మీరు వారికి పంపగలరు (అవసరమైన మార్పులతో) 

ఇవి కొన్ని సూచనలు మాత్రమే... సమగ్రం కాదు! 

త్వరలో తగిన ఉద్యోగం వస్తుంది.. చేసే ప్రయత్నం బట్టి. ఉత్సాహంగా ప్రాజెక్ట్స్ చేస్తూ ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో వాటిని పెట్టండి. (ఉదా. =  ).. అలాంటి అన్నిటివీ కలిపిన లింక్ CV ఉండాలి! 

'తెలిసినవారైనా సరే ప్రస్తుత CVని ఇతరులకు సిఫారసు చేయలేరు కదా...అలా చేస్తే వారి విశ్వసనీయత దెబ్బతింటుంది!  

 మీరు ఈ విమర్శలతో నిరాశపడక శ్రద్ధగా ప్రాజెక్ట్స్ చేస్తే.. రెండునెలల్లో ఉద్యోగం తెచుకోవటం సులభమే

----
అన్నయ్య

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

100% C prog to write content into a file and then read it back onto the console

Spic macay

శ్రీరస్తు.. రామలింగ 18-1-24 (సూరసాని వారి ఆహ్వానము)