మీకు ఓ ఇరవై నిమిషాల సమయం ఉన్నప్పుడు చదవవచ్చు
కొట్ల/కార్యాలయాల పేరు పలకల మీద తెలుగు ఉండటానికి తెలుగు అభిమానులను కదలమని పిలుపు ఇద్దాం అని నిర్ణయించినారు. ఇది చట్టబద్ధమైన పని. దీనికి సంబంధించిన ప్రభుత్వాదేశాలను మనం సేకరించి అడిగిన వారికి ఇవ్వాలి. కొట్టు యజమాని దగ్గరకు వెళ్లి ఆయనతో, తెలుగును ప్రోత్సహించమని చట్టాలను గౌరవించమని కోరాలి. మొత్తం మీద ఈ పనిలో విజయం సాధించిన వారికి తగు సన్మానం, మెచ్చాంకు (appreciation letter), 5,000 రూపాయల పైకం కాన్క ఇవ్వాలి అని నిర్ణయించారు. వెంటనే చాల మంది ఈ పనిలో ముందుకు సాగుతాము అని తెలియజేశారు. అప్పుడు నరసింహప్ప IRS గారు దీనికి కావలసిన వనరులను సమకూరుస్తాను అన్నారు. ఈ పని మొదలు పెట్టే వారు ముందుగా telugukootami.org లో తెలియజేయాలి. లేక 94904 28825,/ 95052 98565 లతో మాట్లాడాలి. తెలుగు కోసం మొదలు పెట్టిన ఈ మొట్ట మొదటి భాషోద్యమ కార్యక్రమాన్ని నిజమైన తెలుగు అభిమానులు అందరూ తెలుగు వారు అందరికి తెలియజేయండి; ప్రోత్సహించండి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
దయచేసి మీ సలహాలను సూచనలను స్పష్టంగా పేర్కొనగలరు. plz see that ur comments are 'acceptable' in a value based society.