Radar వార్తలు.. పేపర్ లో వచ్చినవి 24-8-20 -- 6-10-20
Radar / సబ్జెక్టు సంబంధించి వార్తలు.. పేపర్ లో వచ్చినవి 24-8-20 -- 6-10-20
24-8-20 దినపత్రిక=>
ఇరాక్ 1976లో ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన ఓ న్యూక్లియర్ రియాక్టర్‌ను బాగ్దాద్‌కు 17 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేసింది. దీని ఆధారంగా అణ్వాయుధం తయారు చేస్తోందని ఇజ్రాయెల్ గుర్తించింది. దీనిని ధ్వంసం చేయడానికి 1981 జూన్ 7వ తేదీ ఇజ్రాయెల్‌కు చెందిన యుద్ధవిమానాలు ఆ కేంద్రంపై దాడి చేశాయి. ఆ సమయంలో ఇరాక్ గగనతల నిఘా రాడార్లను పర్యవేక్షించే సిబ్బంది భోజనాలకు వెళ్లడంతో ఈ విమానాలను గుర్తించడంలో జాప్యం జరిగింది. అంతే ఇజ్రాయెల్ విమానాలు ఆ అణు రియాక్టర్‌పై బాంబుల వర్షం కురిపించి వెళ్లిపోయాయి. క్షణాల్లో ఈ ఆపరేషన్ ముగిసిపోయింది. ఒక చిన్న ఏమరపాటు అణుకేంద్రాలకు ఎంత ముప్పో ఈ ఘటన చెబుతుంది.
_----
దినపత్రికలో వచ్చిన వార్త 28-8-20.. గగనతలంలో మరింత మెరుగ్గా నిఘా వేయడం కోసం ఇజ్రాయెల్ నుంచి రెండు ఫాల్కన్ ముందస్తు హెచ్చరిక, నియంత్రణ వ్యవస్థల (అవాక్స్)ను భారత వైమానిక దళం సమకూర్చుకోనుంది. వీటి ఖరీదు 100 కోట్ల డాలర్ల మేర ఉండొచ్చని అధికార వర్గాలు తెలిపాయి. తూర్పు లద్దాఖ్‌లో చైనాతో తీవ్రస్థాయిలో సరిహద్దు వివాదం ఏర్పడిన నేపథ్యంలో భారత్ ఈ కీలక నిఘా వ్యవస్థలను
సమకూర్చుకోనుంది. భారత వైమానిక దళం వద్ద ఇప్పటికే మూడు ఫాల్కన్ అవాక్స్ వ్యవస్థలు ఉన్నాయి. అదనంగా రెండు వ్యవస్థలను సమకూర్చుకోవడం వల్ల భారత గగనతల రక్షణ యంత్రాంగం మరింత మెరుగుపడుతుంది. ''వీటి కొనుగోలుకు ఆమోదం తెలిపే ప్రక్రియ తుది దశకు చేరుకుంటోంది. భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఎస్) తదుపరి సమావేశంలో ఇది పరిశీలనకు వచ్చే అవకాశం ఉంది'' అని ఓ అధికారి పేర్కొన్నారు. అవాక్స్‌ను 'ఆకాశంలో నిఘా నేత్రం'గా పేర్కొంటారు. ఇది చాలా దూరం నుంచే శత్రువుల యుద్ధవిమానాలు, క్షిపణులు, బలగాల కదలికలను పరిశీలించగలదు. మన గగనతలంలో ఉంటూనే శత్రు భూభాగంలోని పరిస్థితులపై నిఘా ఉంచుతుంది. ఫాల్కన్ అవాక్స్‌ను రష్యా నుంచి కొనుగోలు చేసిన ఐఎల్-76 రవాణా విమానంపై అమర్చారు. వీటికితోడు భారత్ వద్ద స్వదేశీయంగా అభివృద్ధి చేసిన రెండు గగనతల రక్షణ వ్యవస్థలు ఉన్నాయి.
మీరు శ్రద్ధగా రాడార్ సబ్జెక్టు నేర్చుకుంటే మనదేశం ఇతరుల వద్ద కొనుక్కునే అగత్యం తప్పుతుంది. చూడండి.. 100 కోట్ల డాలర్లట.. రెండిటికి!
7500 కోట్ల రూపాయలు!
ఇలా ఎంతకాలం?
----
7-9-20 వార్త రక్షణ పరిశోధన విభాగం డీఆర్‌డీవో నేడు హైపర్‌సానిక్ టెక్నాలజీని విజయవంతంగా పరీక్షించినట్లు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ప్రకటించారు. ఈ సాంకేతికతను దేశీయంగా అభివృద్ధి చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో దేశం సాంకేతిక రంగంలో కీలక ముందడుగు వేసినట్లైందని తెలిపారు. ఇందుకు కృషిచేసిన శాస్త్రవేత్తలకు రాజ్‌నాథ్ అభినందనలు తెలిపారు. ప్రధాని కల అయిన ఆత్మనిర్భర్ భారత్ వాస్తవ రూపం ధరించడానికి ఇది కీలక పరిణామమని వెల్లడించారు.
మనం కూడా అభినందనల మెయిల్ పంపవచ్చు https://www.drdo.gov.in/hi/adv-tech-center
----
ఏదైనా ఆయుధం శబ్ద వేగానికి ఐదు రెట్ల వేగంతో ప్రయాణిస్తే దానిని హైపర్‌సోనిక్‌గా ఆయుధంగా పేర్కొంటారు. అంటే మాక్5 స్పీడ్ అన్నమాట. ఈహైపర్‌సోనిక్ ఆయుధాల్లో బాలిస్టిక్ క్షిపణుల్లో ఉండే వేగం.. క్రూజ్ క్షిపణుల్లో వలే మార్గం మార్చుకొనే లక్షణాలు ఉంటాయి. అందుకే ఇది అత్యంత ప్రమాదకరమైన ఆయుధంగా భావిస్తారు. వీటిల్లో అత్యంత శక్తివంతమైన స్క్రాంజెట్ ఇంజిన్లను వాడటంతో విపరీతమైన వేగాన్ని అందుకొంటాయి. ఈ ఇంజిన్లు వాతావరణం నుంచి ఆక్సిజన్‌ను పీల్చుకొని దానిలోని హైడ్రోజన్ ఇంధనంతో కలిపి శక్తిని సృష్టిస్తాయి. దీని సాయంతో అవి మాక్5 స్పీడ్‌ను అందుకొంటాయి.
ఎందుకు వాడతారు..?
హైపర్‌సోనిక్ ఆయుధాలను ప్రత్యేక పరిస్థితుల్లో వినియోగిస్తారు. ముఖ్యంగా బాలిస్టిక్ క్షిపణులను మార్గం మధ్యలోనే ధ్వంసం చేసే అత్యాధునిక రక్షణ వ్యవస్థలను ఛేదించుకొని లక్ష్యాలను ధ్వంసం చేయడానికి వినియోగిస్తారు. వీటి ద్వారా అణ్వాయుధాలను కూడా ప్రయోగించవచ్చు. సుదూర లక్ష్యాలను ఛేదించవచ్చు.
అమెరికా, రష్యా, చైనాలు ఎక్కడ..
2011లో అమెరికా విజయవంతంగా అడ్వాన్స్‌డ్ హైపర్‌సోనిక్ ఆయుధాన్ని పరీక్షించింది. ఇది 3,700 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని చేధించింది. అమెరికాలోని లాక్‌హీడ్ మార్టిన్ సంస్థ దీనిని అభివృద్ధి చేస్తోంది. చైనా, రష్యాలు కూడా ఈ టెక్నాలజీలో బాగా ముందంజలో ఉన్నాయి.
చైనా హైపర్ సోనిక్ గ్లైడెడ్ వెహికల్, హైపర్‌సోనిక్ క్రూజ్ మిసైల్‌ను అభివృద్ధి చేస్తోంది. డీఎఫ్-జెడ్‌ఎఫ్ పేరుతో చేస్తున్న ఈ ఆయుధం మాక్10 వేగంతో ప్రయాణిస్తుందని చైనా చెబుతోంది. ఇది హైపర్‌సోనిక్ గ్లైడ్ వెహికల్‌గా పేర్కొంటోంది. ఇక రష్యా అవెంజర్డ్ పేరుతో హెచ్‌జీవీని అభివృద్ధి చేస్తోంది. ఇది మాక్20 వేగంతో ప్రయాణిస్తుందని చెబుతోంది. ఇదే కాకుండా కేహెచ్-47ఎం2 వంటి పలు రకాల ఆయుధాల అభివృద్ధిపై పరిశోధనలు చేస్తోంది.
భారత్ గతంలో ప్రయోగించిందా..?
భారత్ కూడా గత ఏడాది హైపర్‌సోనిక్ టెక్నాలజీ డెమానిస్ట్రేటర్ వెహికల్‌ను పరీక్షించినట్లు యూరేషియన్ టైమ్స్ వంటి పత్రికల్లో వార్తలొచ్చాయి. అగ్ని-1 క్షిపణి ప్లాట్‌ఫామ్‌పై చేసిన ఈ ప్రయోగం విఫలమైంది. తాజాగా నేడు చేసిన ప్రయోగం విజయవంతమైందని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్వయంగా ట్విటర్‌లో ప్రకటించారు.
మరోపక్క జపాన్ కూడా దేశీయంగా ఇటువంటి హైపర్‌సోనిక్ ఆయుధం తయారీపై దృష్టిపెట్టింది.
రాడార్ వార్త.. 8-9-20
హెచ్‌ఎస్‌టీడీవీ హైపర్‌సోనిక్ ఎయిర్‌బ్రీతింగ్ స్క్రామ్‌జెట్ సాంకేతికతతో తయారైంది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) దీన్ని అభివృద్ధిచేసింది. ధ్వని కన్నా ఆరు రెట్లు వేగంగా దూసుకెళ్లే(మ్యాక్ 6)దీర్ఘశ్రేణి క్షిపణులు, వైమానిక వ్యవస్థలకు ఇంజిన్‌గా హెచ్‌ఎస్‌టీడీవీ ఉపయోగపడుతుంది. ప్రస్తుతం అనేక క్షిపణుల్లో వాడుతున్న 'రామ్‌జెట్' సాంకేతికతకు భిన్నంగా ఈ సాధనంలో 'స్క్రామ్‌జెట్' పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. రామ్‌జెట్ ఇంజిన్‌తో మ్యాక్ 3 వేగం మాత్రమే సాధ్యమవుతుంది.
సెకనుకు 2 కిలోమీటర్ల వేగంతో..
'అగ్ని' క్షిపణిలో వాడే ఘన ఇంధన మోటారుకు క్రూయిజ్ వాహనాన్ని అనుసంధానించి, తాజా ప్రయోగాన్ని శాస్త్రవేత్తలు నిర్వహించారు. ఒడిశా తీరానికి చేరువలోని వీలర్ దీవిలో ఉన్న ఏపీజే అబ్దుల్ కలామ్ లాంచ్ కాంప్లెక్స్ నుంచి ఉదయం 11.03 గంటలకు హెచ్‌ఎస్‌టీడీవీ నింగిలోకి దూసుకెళ్లింది. 30 కిలోమీటర్లు ఎత్తులోకి చేరాక రాకెట్.. హైపర్‌సోనిక్ వేగాన్ని అందుకుంది. వెంటనే దాని ఏరోడైనమిక్ ఉష్ణకవచాలు విడిపోయాయి. ఆ తర్వాత క్రూయిజ్ వాహనం.. లాంచ్ వాహనం నుంచి వేరైంది. క్రూయిజ్ వాహనంలో ఎయిర్ ఇన్‌టేక్ తెరుచుకొని, హైపర్‌సోనిక్ ప్రజ్వలన ఆరంభమైంది. ఇందుకోసం గాల్లోని ఆక్సిజన్‌ను ఇది తీసుకుంది. నిర్దేశించిన మార్గంలో దాని పయనం సాగింది. ఆ సమయంలో అది ధ్వని కన్నా ఆరు రెట్లు ఎక్కువ వేగాన్ని (సెకనుకు 2 కిలోమీటర్లు) సాధించింది. అనుకున్న రీతిలో 20 సెకన్లకుపైగా ఈ వేగాన్ని కొనసాగించింది. ఈ క్రమంలో స్క్రామ్‌జెట్‌కు సంబంధించిన ఫ్యూయెల్ ఇంజెక్షన్, ఆటో ఇగ్నిషన్ వంటి కీలక పరిణామాలన్నీ సాఫీగా సాగాయి. అధిక పీడనం, ఉష్ణోగ్రతల వద్ద కూడా స్క్రామ్‌జెట్ పనిచేసింది. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన మిశ్రమ పదార్థాలు తమ సత్తాను చాటాయి. తాజా ప్రయోగాన్ని రాడార్లు, ఎలక్ట్రోఆప్టికల్ వ్యవస్థలు, టెలీమెట్రి కేంద్రాలు నిరంతరం పర్యవేక్షించాయి. హైపర్‌సోనిక్ వాహనానికి సంబంధించిన క్రూయిజ్ దశను.. బంగాళాఖాతంలో మోహరించిన ఒక నౌక కూడా పరిశీలించింది. పరీక్ష అద్భుత విజయాన్ని సాధించినట్లు ఈ డేటా తేల్చినట్లు రక్షణ మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇలాంటి ప్రయోగం గత ఏడాది జరిగింది. ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. మళ్ళీ ప్రయత్నించి విజయం సాధించాం
----
15-9-20 వార్త
విద్యార్థులకు ఇలాంటివి అలవాటు చేయాలి...
వార్తల్లో సబ్జెక్టు సంబంధించిన విషయాలు వస్తే అందరికీ తెలపాలి.
ఉదా. 4th year ECE ppl have fiber optics subject. సరిహద్దుల వెంబడి భారీస్థాయిలో ఆప్టికల్ ఫైబర్ కేబుల్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసే పనిలో శరవేగంగా పావులు కదుపుతోంది. ఉద్రిక్తతలు అధికంగా ఉన్న పాంగాంగ్ సరస్సులోని దక్షిణ భాగం వరకు కేబుళ్లను వేసేందుకు భారీ ఎత్తున తవ్వకాలు ప్రారంభించింది. ఈ విషయాన్ని భారత సైనిక అధికారులు ద్రువీకరిస్తున్నారు. దీనిపై రాయిటర్ వార్తా సంస్థ.. వివరణ కోరినా స్పందించేందుకు చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ నిరాకరించింది. ఈ ఆందోళనకర పరిణామాన్ని భారత్ సునిశితంగా పరిశీలిస్తోంది. ''వేగవంతమైన సమాచారం కోసం చైనా ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్ వేయడం ఆందోళన కలిగిస్తోంది'' అని ఓ భారత అధికారి చెప్పారు. పాంగాంగ్ సరస్సు దక్షిణ భాగాన కొన్ని ప్రాంతాల్లో భారత్- చైనా సైనికులు కేవలం కొన్ని వందల మీటర్ల దూరంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో దక్షిణ భాగం వరకు కేబుళ్లు వేయడాన్ని భారత్ తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ కేబుళ్ల ద్వారా సరిహద్దుల్లోని దళాలకు వెనుకనున్న సైనిక స్థావరాల నుంచి సురక్షితమైన సమాచారం అందుతుంది. అంతేకాదు ఎప్పటికప్పుడు దృశ్యాలను, డాక్యుమెంట్లను పంపించుకోవచ్చు. ''రేడియోలో మాట్లాడితే దొరికిపోవచ్చు. సంకేతాలను అడ్డుకోవచ్చు. ఆప్టికల్ ఫైబర్‌తో అలాంటి పరిస్థితి ఉండదు. సమాచారం సురక్షితంగా ఉంటుంది'' అని ఓ అధికారి చెప్పారు
----
రాడార్ వార్త 28-9-20 ఒకేసారి 64 టార్గెట్లను ట్రాక్ చేసి, ఒకేసారి పన్నెండింటిపై విరుచకుపడగలిగే 3-డీ రాజేంద్ర రాడార్ కలిగి ఉన్న ఆకాశ్ క్షిపణిని ప్రయోగించేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. కాగా యుద్ధ విమానాలు, క్రూయిజ్ మిసైళ్లు, బాలిస్టిక్ మిసైళ్లను కూడా పేల్చేయగల సామర్థ్యం దీనిసొంతం.
----
రాడార్ వార్త.. 2-10-20
కొత్త విమానం ప్రత్యేకతలివీ...
* భద్రత విషయంలో ఈ విమానాలు అమెరికా అధ్యక్షుడి 'ఎయిర్‌ఫోర్స్ వన్'కు ఏ మాత్రం తీసిపోవు.
* 'ఎయిర్ ఇండియా వన్'లో అధునాతన క్షిపణి రక్షణ వ్యవస్థలు ఉన్నాయి. వీటిని 'లార్జ్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇన్‌ఫ్రారెడ్ కౌంటర్‌మెజర్స్' (ఎల్‌ఏఐఆర్‌సీఎం), 'సెల్ఫ్ ప్రొటెక్షన్ స్వీట్' (ఎస్‌పీఎస్)గా పిలుస్తారు. 19 కోట్ల డాలర్లతో వీటిని భారత్‌కు విక్రయించేందుకు ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా అంగీకరించింది.
* ఎస్‌పీఎస్‌లో కౌంటర్ మెజర్స్ డిస్పెన్సింగ్ సిస్టమ్, ఇంటిగ్రేటెడ్ డిఫెన్సివ్ ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ స్వీట్ ఉంటాయి. ఇవి శత్రువుల రాడార్లను స్తంభింపచేస్తాయి. విమానం ఇంజిన్ల నుంచి వెలువడే ఉష్ణం ఆధారంగా దాన్ని లక్ష్యంగా చేసుకొనే 'హీట్ సీకింగ్' క్షిపణులను బురిడీ కొట్టించి, వాటిని దారి మళ్లిస్తాయి. సిబ్బందితో పనిలేకుండా ఇవన్నీ పనిలేకుండా ఇవన్నీ ఆటోమేటిగ్గా పనిచేస్తాయి.
* ఈ విమానాల్లో అత్యంత అధునాతన, భద్రమైన కమ్యూనికేషన్ వ్యవస్థ ఉంది. దీని ద్వారా ఆడియో, వీడియో కమ్యూనికేషన్ సేవలను పొందొచ్చు. వాటిని మధ్యలో రహస్యంగా వినడం, రికార్డు చేయడం సాధ్యం కాదు.
* ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన రెండు జీఈ90-115బీఎల్ ఇంజిన్ల సాయంతో ఈ విమానాలు ప్రయాణిస్తాయి. గరిష్ఠంగా గంటకు 559.33 మైళ్ల వేగంతో ప్రయాణించగలవు.
* ఒకసారి ఇంధనం నింపితే ఏకబిగిన 17 గంటల పాటు ఆకాశయానం చేయగలవు. ఇంధనం కోసం మధ్యలో ఆగాల్సిన పనిలేకుండా అమెరికా వరకూ వెళ్లగలవు.
* ఈ విమానాల్లో వీవీఐపీల కోసం భారీ క్యాబిన్లు, మినీ వైద్య కేంద్రం, సమావేశ మందిరం, వీవీఐపీల వెంట వచ్చేవారు బస చేయడానికి సకల సౌకర్యాలు ఉంటాయి.
* ఈ విమానాలను భారత వైమానిక దళ పైలట్లు నడుపుతారు.
* ప్రస్తుతం రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాన మంత్రి.. ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్-747 విమానాల్లో ప్రయాణిస్తున్నారు. వీవీఐపీల విదేశీ పర్యటనలు లేని సమయాల్లో వీటిని ప్రయాణికుల అవసరాల కోసం వినియోగిస్తున్నారు. పైగా ఇవి పాతబడిపోయాయి.
* కొత్తగా అందే బోయింగ్-777 విమానాలను వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించరు. పూర్తిగా వీవీఐపీల ప్రయాణాలకే కేటాయిస్తారు. ఇలా విమానాలను ప్రత్యేకంగా కేటాయించడం భారత్‌లో ఇదే మొదటిసారి.
* ఈ విమానాలు పూర్తిగా శ్వేత వర్ణంలో ఉన్నాయి. వీటిపై ఇండియా (ఇంగ్లిష్‌లో), భారత్ (హిందీలో) అని పెద్ద అక్షరాలతో రాసి ఉంది. అశోక స్తంభం చిహ్నాన్నీ ముద్రించారు. విమాన తోకభాగంలో భారత జెండా త్రివర్ణ పతాకాన్ని పెయింట్ చేశారు.
----
రాడార్ వార్త 5-10-20 శత్రువుకు ఏమాత్రం అనుమానం రాకుండా..
స్మార్ట్‌ను యుద్ధనౌకలపై నుంచి కానీ.. లేదా సముద్రం ఒడ్డున ఉంచిన ట్రక్‌పై నుంచి కానీ ప్రయోగించవచ్చు. ఇది లక్ష్యానికి సమీపం వరకు గాల్లో క్షిపణి వలే ప్రయాణిస్తుంది.. సబ్‌మెరైన్ సమీపానికి రాగానే గాల్లో నుంచి నీటిలోకి టార్పిడోను పడేస్తుంది. అది వెళ్లి లక్ష్యాన్ని ఢీకొంటుంది. దాడికి కొన్ని నిమిషాల ముందు వరకు ఈ టార్పిడోను శత్రుసబ్‌మెరైన్ గుర్తించలేదు. దీంతో దానికి అప్రమత్తమై తప్పించుకునే అవకాశాలు దాదాపు మూసుకుపోతాయి. ఇది గాల్లో తక్కువ ఎత్తులో ప్రయాణించడంతో రాడార్లకు కూడా అంత తేలిగ్గా దొరకదు. దీనికి డేటా లింక్‌లు కూడా ఉండటంతో నియంత్రణ ఉంటుంది. బ్రహ్మోస్ తర్వాత పెద్ద ప్రాజెక్టు..
బ్రహ్మోస్ మాక్ 3 యాంటీషిప్ మిసైల్ తర్వాత చేపట్టిన అత్యంత కీలకమైన drdo ప్రాజెక్టు ఇదే. 2016లో ఈ ప్రాజెక్టుకు రూ.340 కోట్లను కేటాయించారు. దేశ సముద్ర జలాల్లోకి ప్రమాదకరంగా చొచ్చుకొచ్చే శత్రు సబ్‌మెరైన్లను దూరం నుంచే ధ్వంసం చేయడానికి దీనిని వాడతారు. ఇది పనిచేసే విధానాన్ని బట్టి దీని రేంజి దాదాపు 650 కిలోమీటర్ల వరకు ఉంటుంది.
రెండు రకాల ఆయుధ వ్యవస్థలను సమ్మిళితం చేసి దీనిని అభివృద్ధి చేశారు. భారత్ ఇప్పటికే టార్పిడోలు.. క్షిపణులు తయారు చేస్తోంది. ఈ టెక్నాలజీలను కలిపి సరికొత్త హైబ్రీడ్ ఆయుధాన్ని తయారు చేశారు. సాధారణంగా భారీ టార్పిడోలు కూడా నీటిలో అత్యధికంగా 50 కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. రాకెట్ అసిస్టెడ్ విధానంలో 150 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తాయి. కానీ, ఈ సరికొత్త హైబ్రీడ్ విధానంలో మాత్రం 600 కిలోమీటర్లకు పైగా దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తుంది.
----
రాడార్ వార్త 6-10-20
భారత్ వ్యూహకర్తలకు ఈ విషయం స్పష్టంగా తెలుసు. భారత్‌కు ఎప్పుడూ ఒక దేశంపై తొలుత యుద్ధం ప్రకటించిన చరిత్రలేదు. తనపై జరిగే దాడుల నుంచి మాత్రం రక్షించుకొంటుంది. మరి చైనాతో పోలిస్తే సైనిక పరంగా భారత్ కొంత బలహీనంగా ఉంది. కానీ, వ్యూహాత్మకంగా లభించే ఆధిపత్యం భారత్‌కు ఉంది. కఠినమైన హిమగిరుల్లో యుద్ధం చేయడం డ్రాగన్‌కు చాలా కష్టమైన పని. దానికి కీలక సరఫరాలు చేసే జీ219 హైవే అత్యంత క్లిష్టమైన మార్గంలో ఉంటుంది. దీంతో భారత దళాలు తమ దృష్టి పూర్తిగా హిమగిరులపై పెట్టకుండా చైనా సముద్రమార్గంలో దాడులను మొదలుపెడితే.. మన సైనిక వనరులను అటువైపు కూడా వినియోగించాల్సి ఉంటుంది. ఇలాంటి స్థితిలో హిమగిరుల్లో మన సైన్యం బలహీనం అవుతుంది. ఇది మన వ్యూహకర్తలు ముందే ఊహించారు. సముద్ర మార్గాల్లో జరిగే దాడుల నుంచి రక్షణ పొందేలా ఏర్పాట్లు చకచకా చేస్తున్నారు
భారత్‌కు ముప్పు ఇలా..
శ్రీలంకలోని హంబన్‌టోటా, పాక్‌లోని గ్వాదర్ పోర్టులను డ్రాగన్ గుప్పిట పెట్టుకొంది. భారత నావికాదళంతో పోలిస్తే చైనా దళం పెద్దది. భారత్ వద్ద నావికాదళంలో 2019 జూన్ నాటికి 67,000 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 10వేల మంది ఆఫీసర్లు. ఇక చైనాలో మొత్తం 2,35,000 మంది ఉన్నారు. మారుతున్న సముద్ర యుద్ధ తంత్రంలో సబ్‌మెరైన్లదే కీలక పాత్ర. శత్రుజలాల్లోకి చొచ్చుకుపోయి.. కీలక స్థావరాలపై క్షిపణుల వర్షం కురిపిస్తాయి. యుద్ధనౌకలను నట్టనడి సముద్రంలో ముంచేయగలవు. చైనా వద్ద మొత్తం 70 సబ్‌మెరైన్లు ఉన్నాయి. వీటిల్లో ఏడు సబ్‌మెరైన్లు అణుదాడులు చేయగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. భారత్ వద్ద మొత్తం సబ్‌మెరైన్ల సంఖ్యే 20లోపు ఉంది. వీటిల్లో అణుదాడి చేయగలిగేది ఐఎన్‌ఎస్ అరిహంత్ ఒక్కటే. భారత్ ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ఈ సబ్‌మెరైన్లు నిశ్శబ్దంగా భారత్‌ను చుట్టుముట్టి దాడి చేస్తాయి.
ఒక్కసారిగా సబ్‌మెరైన్ల సంఖ్యను పెంచుకోవడం భారత్‌కు ఆర్థికంగా సాధ్యంకాదు. దీంతో పోల్చితే సబ్‌మెరైన్లను వేటాడే టెక్నాలజీ చౌకగా లభిస్తుంది. చైనా సబ్‌మెరైన్ల దాడి వ్యూహానికి విరుగుడుగా పనిచేస్తుంది. భారత్ ఈ దిశగా ప్రయత్నాలను వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో సముద్ర గస్తీని పటిష్ఠం చేసే పీ-8ఐ మారిటైమ్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను భారత్ కొనుగోలు చేసింది. సముద్ర జలాల్లో నక్కిన సబ్‌మెరైన్లను పసిగట్టడంలో ప్రపంచలోనే ఇవి అత్యుత్తమమైనవి. హిందూ మహాసముద్రంలో చైనాను కట్టడి చేయడానికి అమెరికా వీటిని భారత్‌కు సమకూరుస్తోంది. దీంతోపాటు 'ఎంహెచ్-60 రోమియో సీహాక్' హెలికాప్టర్లను యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్‌గా, యాంటీ సర్ఫేస్ వెపన్స్ సిస్టంగా వాడేందుకు అమెరికా నుంచి భారత్ కొనుగోలు చేసింది. రాయల్ ఆస్ట్రేలియన్ నేవీ సహా మరికొన్ని దేశాలు వీటిని ఉపయోగిస్తున్నాయి. హిందూ మహా సముద్రంలో ప్రత్యర్థుల జలాంతర్గాములపై నిఘా కోసం వీటిని ఉపయోగించనున్నారు. ఈ హెలికాప్టర్లు యుద్ధనౌకలపై నుంచి సముద్రంపైకి ఎగిరి దీని మల్టీమోడ్ రాడార్‌తో సుదూర జలాల్లో శత్రువుల జాడను పసిగడుతుంది.
డీఆర్‌డీవో అత్యంత రహస్యంగా 'సూపర్‌సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టోర్పిడో' (స్మార్ట్) ప్రాజెక్టును చేపట్టింది. సముద్ర జలాల్లో సబ్‌మెరైన్లను అంతం చేయాలంటే టోర్పిడోల వల్లే సాధ్యం. కానీ, ఇవి 50-60 కిలోమీటర్లను మించి ఎక్కువ దూరం ప్రయాణించలేవు. దీంతో డీఆర్‌డీవో వీటిని కనీసం 650 కిలోమీటర్ల అవతల లక్ష్యాలను ఛేదించేలా తీర్చిదిద్దాలని ఈ ప్రాజెక్టు చేపట్టింది. సముద్ర జలాల అడుగున వందల కిలోమీటర్లు ప్రయాణించాలంటే చాలా శక్తి, సమయం అవసరం.. అదే గాల్లో అయితే ఎక్కువ దూరాన్ని తక్కువ సమయంలో చేరుకోవచ్చు. ఈ నేపథ్యంలో రాకెట్ వ్యవస్థకు యాంటీసబ్‌మెరైన్ టోర్పిడోను అమర్చి ప్రయోగించేలా స్మార్ట్‌ను అభివృద్ధి చేశారు.
-8ఐ విమానం, హెలికాప్టర్లు శత్రు సబ్‌మెరైన్‌ను గుర్తించి సమాచారాన్ని నావిక దళానికి అందిస్తాయి. గుర్తించిన ప్రదేశాన్ని లక్ష్యంగా చేసుకొని స్మార్ట్‌ను ప్రయోగిస్తే.. అది అక్కడ టోర్పిడోను వదులుతుంది. అక్కడి నుంచి టోర్పిడో నీటి అడుగున స్వల్పదూరం(దాదాపు 20 కిమీ) ప్రయాణించి శత్రులక్ష్యాన్ని నాశనం చేస్తుంది. ఇప్పడు సబ్‌మెరైన్లపై నిఘా వ్యవస్థలు, వాటిని ధ్వంసం చేసే ఆయుధాలను భారత్ వేగంగా అభివృద్ధి చేస్తోంది. అమెరికా వద్ద ఇటువంటి వ్యవస్థ ఉన్నా.. అది 25 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తుంది. ''ప్రపంచంలో ప్రస్తుతం ఇటువంటి వ్యవస్థను పోలిన ఆయుధాలు ఏవీ స్మార్ట్‌కు సరిరావు. రష్యా వద్ద ఉన్న 91ఆర్‌ఈ1, 91ఆర్‌ఈటీ2, అమెరికా వద్ద ఉన్న సీలాన్స్, ప్లస్ ఆస్రోక్‌లు ఇటువంటి విధానంలోనే పనిచేస్తాయి. కానీ, ఇవేవీ 650 కిలోమీటర్ల దూరంలోని సబ్‌మెరైన్లను ధ్వంసం చేయలేవు'' అని రక్షణ రంగ విశ్లేషకుడు సౌరవ్ ఝా పేర్కొన్నారు. ఇప్పటికే భారత్ అండమాన్ నికోబార్ కమాండ్ పరిధిలో బలమైన నావికాదళ స్థావరాన్ని ఏర్పాటు చేసింది. ఇక్కడ స్మార్ట్‌లను మోహరిస్తే.. డ్రాగన్ సబ్‌మెరైన్లు హిందూమహాసముద్రంలోకి రావడం చాలా కష్టతరంగా మారుతుంది
----
ఒక అధ్యాపకునిగా దినపత్రికలో వచ్చిన సబ్జెక్టు సంబంధించిన వార్తలు విద్యార్థులకు పంపుతూ వారు ఉత్సాహంగా నేర్చుకోవటానికి ప్రయత్నం
ధన్యవాదములు
విక్రమ్ భయ్యా
8331926163
శాస్త్ర విజ్ఞాన ప్రచారక్
Science Communicator
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
దయచేసి మీ సలహాలను సూచనలను స్పష్టంగా పేర్కొనగలరు. plz see that ur comments are 'acceptable' in a value based society.