తెలుగు భాషా పుస్తక సంపదను, వారసత్వాన్ని కాపాడుకుందాం! 

మీకు తెలుగు భాష అంటే మక్కువ? ఆధునిక AI టూల్స్ సహాయంతో మన పురాతన సాహిత్యాన్ని భావి తరాలకు అందించే అద్భుతమైన అవకాశం మీకోసం! 

తెలుగునాట  పురాతన గ్రంథాలయం 'శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయం' (కోఠి, హైదరాబాద్) ప్రతి శనివారం ఉదయం 11 గంటలకు లైబ్రరీలో ప్రత్యేక తరగతులు జరుగుతాయి.
1901 సెప్టెంబర్ 1న స్థాపించబడిన ఈ సంస్థ, తెలుగు సాహిత్యం, సంస్కృతి మరియు గ్రంథాలయ ఉద్యమానికి ప్రధాన కేంద్రంగా నిలిచింది , లైబ్రరీలో ఉన్న  పుస్తకాలను డిజిటలైజ్ చేసే బృహత్తర ప్రాజెక్టులోకి వలంటీర్లను సాదరంగా ఆహ్వానిస్తోంది.
 కేవలం మీ మొబైల్ ఫోన్ ద్వారా పుస్తకంలోని ముఖ్య పేజీలను స్కాన్ చేసి, AI టూల్స్ ఉపయోగించి వాటిని డిజిటల్ రూపంలోకి మార్చడం ఇంకా పుస్తక , రచయిత  మెటాడేటాను (Metadata) క్రియేట్ చేయడం, అంతర్జాలంలో అందుబాటులో వుంచటం,  (దీనిపై మీకు ఉచిత శిక్షణ ఇవ్వబడుతుంది).

సమయం: మీ వెసులుబాటును బట్టి (వారానికి కొన్ని గంటలు - 4 నుండి 6 వారాల పాటు).

వేదిక: శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయం, సుల్తాన్ బజార్, కోటి, హైదరాబాద్.

గమనిక: ఇది పూర్తిగా స్వచ్ఛంద (Voluntary) సేవ. 

ఆసక్తి ఉన్నవారు వెంటనే ఈ క్రింది లింక్ ద్వారా నమోదు చేసుకోగలరు:

 మరిన్ని వివరాలకు: 9014120442
ఈమెయిల్: sktbn.org@gmail.com

🙏 దయచేసి ఈ మెసేజ్‌ను భాషాభిమానులకు, విద్యార్థులకు ,  మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసి మన తెలుగు భాషా సేవలో భాగస్వాములు కండి!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

100% structure basic program with book details

Spicmacay convention implementation suggestions