15-7-23న శ్రీకాళహస్తి జ్ఞానప్రసూనాంబ అమ్మవారి దర్శనవేళ స్ఫురించిన ఆటవెలది
పామరులుగ సుతులు పతనమొంద
కుండ నీవు గావకున్న దిక్కు యెవరె?
తల్లి ఇంత చెప్ప తగునె నీకు?
---
14-7-23న
వ్రాసిన ఆటవెలది పద్యాలు
దర్శనం కోసం కూర్చోబెడితే ఆలోచనలు ఆగుతాయా?
ఇస్రో విజయయాత్ర
శాస్త్రవేత్తలకును సామాన్య జనులకున్
సంతసంబుకలిగె; సందమామ
సంగతులను తెలియ సాధ్యమౌననివిని
ఉత్సవాలు చేసె ఊరివారు (/ఊరి జనులు)
----
1. నింగిలోన నుండి నిక్కెడు జాబిల్లి
2. గుట్టుతెలియగోరి గురుతరమగు
3. పనికి పూనుకొనిరి పరిశోధకుల్ ఉర్వి (/ధాత్రి)
3. కార్యమొకటి పూనె కష్టమునెంచక
4. జనులు సంతసించి జయముపలికె(/పలుక)
----
1. వేచిచూచువేళ వేసట చెందక
2. వెంకటేశు భజన వేడ్క తోడ(/మీర)
3. వేలమంది చేయ వెన్నుడు మదిలోనె(/తృటిలోన)
4. గోచరించుగాదె గోడు తీర్ప (/గోస దీర/ గోస తొలగ)
దైవ దర్శనానికి గంటల సమయం పడుతుందని వాపోయి అయిష్టంగా గుడికి వేళ్ళే బదులు ఇలా కూర్చున్నంతసేపు పద్యాలు వ్రాసుకుంటే/ పాడుకుంటే సరి?! vikramkumar.volunteer@gmail.com
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
దయచేసి మీ సలహాలను సూచనలను స్పష్టంగా పేర్కొనగలరు. plz see that ur comments are 'acceptable' in a value based society.